Ticket less Journey: టికెట్ లేని ప్రయాణికులు: రికార్డు స్థాయిలో రూ.23 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వేశాఖ

అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఏడాది కాలంలో సుమారు రూ.23 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేశారు

Ticket less Journey: టికెట్ లేని ప్రయాణికులు: రికార్డు స్థాయిలో రూ.23 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వేశాఖ

Train

Ticket less Journey: ‘టికెట్ లేని ప్రయాణం నేరం’. రైల్వే స్టేషన్ లలోనూ, బస్సుల్లోనూ అధికారులు ఈ సూచికను ఏర్పాటు చేస్తుంటారు. అధికారుల హెచ్చరికలు పట్టించుకోని కొందరు మాత్రం టికెట్ లేకుండానే ప్రయాణించి రవాణా సంస్థలకు నష్టం చేకూర్చడంతో పాటు.. లేనిపోని తిప్పలు తెచ్చుకుంటారు. అలా టికెట్ లేని ప్రయాణికుల నుంచి భారతీయ రైల్వేశాఖ రికార్డు స్థాయిలో జరిమానాలు వసూలు చేసింది. ఒక్క ఏడాది కాలంలో సుమారు రూ.23 కోట్ల రూపాయలు జరిమానా వసూలు చేశారు రైల్వేశాఖ అధికారులు. అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 మధ్య కాలంలో టికెట్/క్రమరహిత టికెట్ మరియు లగేజీ బుకింగ్ లేకుండా ప్రయాణించిన 4,48,392 మందిని గుర్తించిన అధికారులు రికార్డు స్థాయిలో రూ. 23.36 కోట్లను ఛార్జీలు మరియు జరిమానాగా వసూలు చేశారు.

Also read:Uddhav Thackeray: “మోదీ లేకపోతే గుజరాత్ ఉండదు” బాల థాకరే వ్యాఖ్యలను బయటపెట్టిన సీఎం ఉద్ధవ్

ఈశాన్య సరిహద్దు రైల్వే సీపీఆర్వో సబ్యసాచి డే..వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రతినిధితో మాట్లాడుతూ, గత ఏడాది ఇదే కాలానికి జరిమానా కేసుల సంఖ్య పరంగా 840.83 శాతం ఎక్కువ అని, ఆదాయాల పరంగా 1028.50 శాతం ఎక్కువ అని వివరించారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు సరైన టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న 50,701 మందిని ఎన్ఎఫ్ రైల్వేకు చెందిన ఆర్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల్లో 25 మందిని రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, జరిమానా విధించామని, నేరస్థులపై 16 కేసులు నమోదు చేశామని సీపీఆర్వో సబ్యసాచి తెలిపారు.

Also read:Jaggareddy: అడ్డుకున్నా సరే రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతాం: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో నిత్యం టికెట్ చెకింగ్ కొనసాగుతుంటుందని, కావునా రైల్వే ప్రయాణికులందరూ సరైన రైల్వే టికెట్లు కొనుగోలు చేసి హుందాగా ప్రయాణించాలని సబ్యసాచి డే అన్నారు. టికెట్ కొని ప్రయాణించే ప్రయాణికుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు వారికి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 137 ప్రకారం, టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం, లేదా లగేజి బుకింగ్ లేకుండా ప్రయాణించడం జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండింటి ద్వారా శిక్షించదగిన నేరం.

Also read:Permission for Indians: భారత్‌లోఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారతీయులకైనా పర్మిషన్ కావాలి