Congress win in Kerala: కేరళ సీఎంకు భంగపాటు: కీలక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటముల్లో లుకలుకలు ఏర్పడుతున్న తరుణంలో కీలకమైన ఒక అసెంబ్లీ స్థానంలో ఆపార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి.

Congress win in Kerala: కేరళ సీఎంకు భంగపాటు: కీలక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ

Kerala

Congress win in Kerala: కేరళ రాష్ట్రంలో అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని LDF కూటమికి భంగపాటు కలిగింది. కీలక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలోని UDF అభ్యర్థి ఘన విజయం సాధించారు. కేరళ ఆర్ధిక రాజధాని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రిక్కాకర అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ – యూడీఎఫ్ అభ్యర్థి ఉమా థామస్..ప్రత్యర్థి LDF కూటమి అభ్యర్థి జో జోసెఫ్ పై 25 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటముల్లో లుకలుకలు ఏర్పడుతున్న తరుణంలో కీలకమైన ఒక అసెంబ్లీ స్థానంలో ఆపార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి.

Other Stories: Rahul Gandhi: పీఎఫ్ ఖాతా సొమ్ముపై వడ్డీ రేటు తగ్గించిన కేంద్రం: ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు

అయితే ఈ ఫలితంపై అధికార పార్టీ కంగు తినింది. సీఎం పినరయి విజయన్ సైతం ఈ ఓటమిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రిక్కాకర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పీటీ థామస్ గతేడాది మరణించారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎంతో కీలకమైన త్రిక్కాకర స్థానంపై అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా పోటీపడ్డాయి. సీఎం పినరయి విజయన్ సహా..సగం మంది కేబినెట్ మంత్రులు ఇక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ఈ అసెంబ్లీ స్థానం ఎంత కీలకమైనదో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల బరిలో నిలిచిన రెండు ప్రధాన పార్టీలు..హోరాహోరీగా ప్రచారం చేశాయి.

Other Stories: Kerala: కేర‌ళ‌లోని 3 జిల్లాల్లో క‌రోనా కేసుల విజృంభ‌ణ‌

అయినా ప్రజలు కాంగ్రెస్ – యూడీఎఫ్ అభ్యర్థి ఉమా థామస్ కే పట్టం కట్టారు. అయితే ఘోర ఓటమిని ఊహించని అధికార పార్టీ విశ్లేషణ చేపట్టింది. ఇక్కడి ‘కొచ్చి నగరం’లో సెమి హై స్పీడ్ రైలు నిర్మాణ ప్రాజెక్టుపై స్థానిక ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికి దాన్ని అభివృద్ధిలో భాగంగా చూపుతూ..అధికార ఎల్డీఎఫ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది. అదే సమయంలో త్రిక్కాకర ప్రాంతంలో మైనారిటీ, క్రిస్టియన్ వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు కలిసొచ్చింది. ఇక ఈ విజయంతో కేరళ కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నాయని మరోసారి ఋజువైందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.