India Corona Cases Today: ఒక్కరోజులో మూడు లక్షలకు చేరువగా కరోనా కేసులు

India Corona Cases Today: ఒక్కరోజులో మూడు లక్షలకు చేరువగా కరోనా కేసులు

India Covid

Biggest corona spike: దేశవ్యాప్తంగా 13 కోట్ల కరోనా వ్యాక్సిన్లు ఇప్పటివరకు వేసినా కూడా.. కరోనా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు కరోనా గణాంకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన లేటెస్ట్ లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 295,041 కొత్త కరోనా కేసులు.. అంటే దాదాపు మూడు లక్షలకు చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా.. 2023 మంది సోకినవారు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుండి 1,67,457 మంది కోలుకున్నారు.

దేశంలో కరోనా పరిస్థితి:
మొత్తం కరోనా కేసులు- ఒక కోటి 56లక్షల 16వేల 130
కోలుకున్నవారు – ఒక కోటి 32 లక్ష 76 వేల 39
మొత్తం క్రియాశీల కేసులు – 21 లక్ష 57 వేల 538
మరణించినవారు – 1 లక్ష 82 వేల 553

దేశంలో కరోనా మరణాల రేటు 1.17 శాతం కాగా, రికవరీ రేటు 85 శాతం. యాక్టివ్ కేసులు 13 శాతానికి పైగా పెరిగాయి. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తం సోకిన వారి సంఖ్య విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. యుఎస్ఎ, బ్రెజిల్ మరియు మెక్సికో తరువాత ప్రపంచంలో అత్యధిక మరణాలు భారతదేశంలో ఉన్నాయి.

ప్రపంచంలో అమెరికాలో తప్ప మరే దేశంలోనూ 24గంటల్లో ఇన్ని కేసులు రికార్డుకాలేదు. భారత్‌లో నిమిషానికి 204 మంది వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రపంచంలోని టాప్‌ 10 కరోనా దేశాల్లో కొత్త కేసులను కలిపినా ఇండియాకంటే తక్కువే ఉన్నాయి. అమెరికా కంటే ఐదున్నర రెట్లు ఎక్కువగా కొత్త కేసులు బయపడ్డాయి.

వైరస్‌ అటు మరణాల్లోనూ కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఒక్కరోజులోనే 2 వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. ఇప్పటిదాకా దేశంలో నమోదైన రోజువారీ మరణాల్లో ఇదే అత్యధికం. భారత్‌లో గంటకు 84మందిని బలితీసుకుంటోంది ఈ మహమ్మారి. అమెరికా కంటే రెండున్నర రెట్ల ఎక్కువ మరణాలు భారత్‌లోనే రికార్డవుతున్నాయి. పాజిటివిటీ రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నిన్న ఒక్క రోజు ఏకంగా 19శాతం పాజిటివిటీ శాతం రికార్డయింది.

మహామ్మారి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ రేంజ్‌లో పాజిటివిటీ రేటు ఎప్పుడూ నమోదుకాలేదు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు పతాక స్థాయికి చేరింది. అక్కడ ఏకంగా 32శాతం పాజిటివిటీ శాతం రికార్డయింది. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌లో మహమ్మారి కట్టలు తెంచుకుంది. ఈ ఒక్క నెలలోనే 34 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడు రోజుల్లోనే 17 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ ఒక్క వారంలో నమోదైన ప్రపంచ కేసుల్లో ఇండియా నుంచే 30శాతం మేర పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడురోజుల్లో 62శాతం కేసులు వృద్ధి చెందాయి.