Amit Shah: అమిత్ షా ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తి అరెస్ట్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తిని గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుంఠ్‌పూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మిథిలేష్ తివారీని తిట్టినట్లుగా ఆ అకౌంట్ నుంచి పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Amit Shah: అమిత్ షా ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తి అరెస్ట్

maoists arrest

 

 

Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తిని గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుంఠ్‌పూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మిథిలేష్ తివారీని తిట్టినట్లుగా ఆ అకౌంట్ నుంచి పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరిపిన పోలీసులు విక్కీ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

“దేవ్ కలీ గ్రామానికి చెందిన విక్కీ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం” అని మొహమ్మద్ పూర్ స్టేషన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ వివరించారు.

కాసేపటి తర్వాత జేడే-యూ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీత్ సింగ్ మొహమ్మద్‌పూర్ లోని కార్యకర్తలతో సహా పోలీసు స్టేషన్ కు వచ్చి ధర్నాకు దిగారు. విక్కీ అనే వ్యక్తితో బాండ్ రాయించుకుని వదిలేశారంటూ ఆరోపణలు చేశారు.

Read Also : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్

 

మిథిలేష్ తివారీతో మంజీత్ సింగ్‌కు గట్టి పోటీ ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విక్కీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని మంజీత్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.