ఆ పని మగవాళ్లే చేయాలా..? మేం ఎందుకు చేయకూడదు

ఆ పని మగవాళ్లే చేయాలా..? మేం ఎందుకు చేయకూడదు

“Gurhathi” is done by groom’s elder brother : ఆ పని మగవాళ్లే చేయాలా ఏం..మేము ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది ఓ యువతి. అన్నట్లుగానే..చేసి చూపించింది. పెళ్లి లేదా ఇతర శుభాకార్యాల్లో సోదరీ, సోదరుల స్థానం ప్రముఖంగా ఉంటుంది. పెళ్లిలో వధూ, వరుల సోదరుల చేతుల మీదుగా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్నలు లేకపోతే..వరుసకు అన్నయ్యే వారు..ఆ కార్యక్రమం కాస్తా కొనసాగిస్తుంటారు. ఇలాగే..ఓ పెళ్లిలో వరుడికి సోదరుడు లేకపోవడంతో..సోదరి..ఆ ప్రక్రియను చేయడం హాట్ టాపిక్ అయ్యంది. ఆమె చేసిన పనిని పలువురు అభినందించారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగింది ?

బీహార్ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లలో గుర్హతి అనే సంప్రదాయం ఉంటుంది. వధూవరులు పెళ్లి మండపంలోకి వచ్చిన తర్వాత…అత్తింటి వారు వధువుకు చీరలు, నగలు ఇస్తుంటారు. వరుడి అన్న చేతుల మీదుగా ఈ క్రతువు జరుగుతుంది. వరుడికి అన్న లేకపోతే..వరుసకి అన్నయ్య అయ్యే వ్యక్తి నిర్వహిస్తాడు.

రాష్ట్రంలో మీమాంస శేఖర్ అనే యువతి సోదరుడి వివాహం జరిగింది. అత్తింటి వారు ఇచ్చిన బహుమతులను తాను తీసుకొంటానని చెప్పంది. తొలుత పూజారి సంశయించారు. చివరకు మీమాంస సంధించిన ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పలేక తలూపాడు. మండపంలో ఉన్న కొంతమంది దీనిని స్వాగతించగా..మరికొంతమంది వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.