Gujarat : గుజరాత్‌లో గుర్తు తెలియని వ్యర్ధాల కలకలం | Gujarat

Gujarat : గుజరాత్‌లో గుర్తు తెలియని వ్యర్ధాల కలకలం

గుజరాత్‌లోని మూడు ప్రదేశాల్లో నిన్న ఆకాశం నుంచి గుర్తుతెలియని వ్యర్ధ పదార్ధాలు పడ్డాయి. ఆనంద్ జిల్లాలోని రాంపూర్, భలేజ్, ఖంభోల్జ్ గ్రామాల్లో ఆకాశం నుంచి ఈ శిధిలాలు రాలి పడ్డాయి.

Gujarat : గుజరాత్‌లో గుర్తు తెలియని వ్యర్ధాల కలకలం

Gujarat :  గుజరాత్‌లోని మూడు ప్రదేశాల్లో నిన్న ఆకాశం నుంచి గుర్తుతెలియని వ్యర్ధ పదార్ధాలు పడ్డాయి. ఆనంద్ జిల్లాలోని రాంపూర్, భలేజ్, ఖంభోల్జ్ గ్రామాల్లో ఆకాశం నుంచి ఈ శిధిలాలు రాలి పడ్డాయి. గురువారం సాయంత్రం గం.4-45 లకు ఐదు కిలోల బరువున్న మొదటి, పెద్ద, బ్లాక్ మెటల్ బాల్ భలేజ్ గ్రామంలో పడింది. ఆ తర్వాత ఖంబోలాజ్, మరియు రాంపూర్ లో ఈ శకలాలు ఆకాశం నుంచి పడ్డాయి.

ఈ మూడు ప్రాంతాలు ఒకదానికొకటి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిని చూసి భయపడిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వాటిని పరిశీలించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ నుంచి నిపుణులను పిలిపించారు.

ఈ శకలాలు ఖంభోల్జ్ లో ఒక ఇంటికి సమీపంలోనూ… మరో రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో పడటంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు వీటిని శాటిలైట్ వ్యర్ధాలుగా భావిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ రిపోర్టు వచ్చిన తర్వాత వీటి గురించి విచారణ చేపడతామని అనంద్ జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ చెప్పారు.

×