Indian – Japan: జపాన్ ప్రధాని భారత్ పర్యటన: రెండో రోజు యుక్రెయిన్, చైనా అంశాలపై చర్చ

ప్రధానంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, చైనా దురాక్రమణలు, క్వాడ్ కూటమి భవిష్యత్తు ప్రణాళికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు

Indian – Japan: జపాన్ ప్రధాని భారత్ పర్యటన: రెండో రోజు యుక్రెయిన్, చైనా అంశాలపై చర్చ

Modi Kishida

Indian – Japan: జపాన్ ప్రధాని ఫుమియో కీషీదా భారత్ పర్యటన రెండో రోజు ఫలవంతగా కొనసాగినట్లు తెలుస్తుంది. జపాన్ ప్రధాని ఫుమియో కీషీదాను కలుసుకున్న శుభసందర్భంలో ప్రధాని మోదీ జపాన్ భాషలో ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. భారత్ లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చిన జపాన్ పీఎం కీషీదా..భారత ప్రధాని మోదీతో పలు కీలక అంశాలపైనా చర్చించారు. ప్రధానంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, చైనా దురాక్రమణలు, క్వాడ్ కూటమి భవిష్యత్తు ప్రణాళికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఖండించాలని, భారత్ చొరవ చూపి రష్యాని ఆపే ప్రయత్నం చేయాలనీ కీషీదా ప్రధాని మోదీకి సూచించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. రష్యాతో చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలమని.. యురోపియన్ దేశాలు, నాటో సభ్య దేశాలు..పుతిన్ తో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Also Read: Bhagwant Mann: ప్రతీ మంత్రికి ఒక్కో టార్గెట్టు.. డిమాండ్లు నెరవేర్చలేకపోతే అవుట్ అంతే

మార్చి రెండో వారంలో జరిగిన క్వాడ్ సభ్య దేశాల సమావేశంలోనూ ప్రధాని మోదీ ఇదే తటస్థ వైఖరిని ప్రదర్శించారు. యుక్రెయిన్ విషయంలో భారత వైఖరిపై క్వాడ్ దేశాధినేతలు – కిషిదా, US అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ సైతం పెదవి విరిచారు. అయితే రష్యాతో భారత్ స్నేహాన్ని క్వాడ్ నేతలు ప్రశ్నించలేదు. యుక్రెయిన్ సంక్షోభంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని క్వాడ్ నేతలు ఉమ్మడి ప్రకటన చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా కదలికలను పెంపొందించడానికి జపాన్, ఆస్ట్రేలియా, భారత్ లు అమెరికాతో కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

Also Read: Spurious Liquor Deaths : కల్తీ మద్యం కలకలం.. మరో 17 మంది మృతి..!

ఇక చైనా – భారత్ అంశంపై జపాన్ ప్రధానితో మోదీ చర్చించారు. 2020 గాల్వాన్ ఘర్షణల అనంతరం చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేయగా.. ఇండో పసిఫిక్ తీరంలోనూ చైనా దురాక్రమణకు పాల్పడుతుందని జపాన్ ప్రధాని కీషీదా మండిపడ్డారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు అడ్డుకట్టవేసి, శాంతి, స్థిరత్వం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడమే లక్ష్యంగా క్వాడ్ సభ్య దేశాలు కృషి చేస్తున్నాయి. చైనా చర్యలపై ఇరువురు ప్రధానులు ఉమ్మడి ప్రణాలికను పరస్పరం పంచుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ఆ దేశ ప్రధాని స్కాట్ మోరీసన్ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. యుక్రెయిన్ పైనా వీరిరువురు చర్చించనున్నారు.

Also read: Ukraine Children deaths: యుక్రెయిన్ ప్రజలపై రష్యా దాష్టికం.. 115 మంది చిన్నారులు మృతి