Karnataka: అరటిపళ్లు, చిక్కీ కాదు గుడ్లు కావాలి.. 80% స్కూలు పిల్లల అభిప్రాయమిది

డిసెంబర్ 14 వరకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 47.97 లక్షల మంది విద్యార్థుల్లో 38.37 లక్షల మంది విద్యార్థులు గుడ్లు, 3.37 లక్షల మంది అరటిపండ్లు, 2.27 లక్షల చికెన్‭ను ఇష్టపడ్డారని స్వయంగా ప్రభుత్వ విద్యాశాఖ వెల్లడించింది. అయితే ప్రభుత్వం ఈ డేటా తీసుకున్న సమయంలో మిగిలిన పిల్లలు గైర్హాజరయ్యారట.

Karnataka: అరటిపళ్లు, చిక్కీ కాదు గుడ్లు కావాలి.. 80% స్కూలు పిల్లల అభిప్రాయమిది

In Karnataka, 80 per cent children choose eggs over bananas and chickpeas at mid-day meal

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో చాలా రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంపై మత పెద్దలు, రాజకీయ నేతల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. విద్యార్థులకు వెజిటేరియన్ భోజనమే పెట్టాలని మత పెద్దలు అంటుండగా, పిల్లలకు పౌష్టికాహారం అవసరమని, వారికి గుడ్లు సహా మరిన్ని పోష్టిక విలువలతో కూడిన భోజనం పెట్టాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అటు మత పెద్దలు కాకుండా, ఇటు రాజకీయ నేతలు కాకుండా పిల్లలు ఏమనుకుంటున్నారనే విషయమై సర్వే నిర్వహించగా.. అరటిపళ్లు, చిక్కీ(వేరుశెనగలు)కి బదులు కోడిగుడ్లు కావాలని 80 శాతం మంది విద్యార్థులు వెల్లడించారు.

Ramesh Jarikiholi: ఓటుకు రూ.6,000 ఇస్తాను.. పబ్లిక్‭గా ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే

వాస్తవానికి ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో ఈ మూడింటినీ అందిస్తున్నారు. కాకపోతే గుడ్డు స్థానంలో అరటిపళ్లు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం 20 శాతం అరటిపళ్ల వైపు మొగ్గు చూపగా, 80 శాతం మంది గుడ్లవైపు మొగ్గు చూపారు. డిసెంబర్ 14 వరకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 47.97 లక్షల మంది విద్యార్థుల్లో 38.37 లక్షల మంది విద్యార్థులు గుడ్లు, 3.37 లక్షల మంది అరటిపండ్లు, 2.27 లక్షల చికెన్‭ను ఇష్టపడ్డారని స్వయంగా ప్రభుత్వ విద్యాశాఖ వెల్లడించింది. అయితే ప్రభుత్వం ఈ డేటా తీసుకున్న సమయంలో మిగిలిన పిల్లలు గైర్హాజరయ్యారట.

Guruvayur Temple: రూ.1,700 కోట్లు, 260 కేజీల బంగారం, 271 ఎకరాలు.. గురువాయూర్ గుడి ఆస్తులివి

ఇంతకు ముందు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఉండేది కాదు. అయితే జూలై 2022లో గుడ్లను చేర్చారు. అనంతరం పిల్లల ఆహార అభిరుచిపై అధ్యయనం చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ 1 నుండి 8 తరగతుల పిల్లలకు వేడిగా వండిన భోజనంతో పాటు గుడ్లు, అరటిపండ్లను ఎంచుకోవచ్చు. వీటితో పాటు చిక్కీని కూడా ఎంచుకోవచ్చు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మధ్యాహ్న భోజన పథకం) కలయిక కింద వినూత్న కార్యకలాపాల సౌలభ్యంలో భాగంగా అనుబంధ పోషకాహారాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరం 2022లో సంవత్సరానికి 46 జిల్లాల్లో అందించనున్నట్లు ప్రభుత్వ ఆదేశాలు చెబుతున్నాయి.

Akhilesh Yadav: ఈసారి ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా? ఎస్పీ చీఫ్ అఖిలేష్ జోస్యం ఏంటంటే..?

రాష్ట్రవ్యాప్తంగా కోడిగుడ్లు తీసుకున్న 38.37 లక్షల మంది విద్యార్థుల్లో అత్యధికంగా 15.67 లక్షల మంది బెలగావి డివిజన్‌కు చెందిన వారు కాగా, బెంగళూరు డివిజన్ (8.65 లక్షలు), కలబురగి డివిజన్ (8.33 లక్షలు), మైసూరు డివిజన్ (5.70 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ మాట్లాడుతూ “పౌష్టికాహార లోపం విద్యకు ఆటంకం కలిగించకూడదని ఉద్దేశంతో మేము అన్ని జిల్లాల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లను ప్రవేశపెట్టాము. ఆహారం అనేది చర్చనీయాంశం కాకూడదు. ప్రతి ఒక్కరికి సొంత అభిరుచులు ఉంటాయి. అయితే, ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత కళ్యాణ్-కర్ణాటక ప్రాంతం నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో ఇతర జిల్లాల్లో కూడా పోషకాహార లోపంతో పోరాడటానికి గుడ్లను చేర్చాలని మేము నిర్ణయించుకున్నాము’’ అని అన్నారు.