Karnataka: కులాంతర వివాహం.. పరువు తీశారంటూ దంపతులపై 28ఏళ్ల తర్వాత దాడి!

కొన్నేళ్ల క్రిందట దేశంలో కులాంతర వివాహం అంటే, అదేదో తప్పులా చూసేవారు. అభివృద్ధి చెందుతున్న కొద్ది అటువంటి పరిస్థితిలో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పటికి కూడా కులాంతర వివాహాలు అంటే, పెద్ద తప్పు అనే పరిస్థితులు ఉన్నాయి.

Karnataka: కులాంతర వివాహం.. పరువు తీశారంటూ దంపతులపై 28ఏళ్ల తర్వాత దాడి!

Inter Caste Marriage

Inter-caste couple attacked nearly 28 years after marriage: కొన్నేళ్ల క్రిందట దేశంలో కులాంతర వివాహం అంటే, అదేదో తప్పులా చూసేవారు. అభివృద్ధి చెందుతున్న కొద్ది అటువంటి పరిస్థితిలో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పటికి కూడా కులాంతర వివాహాలు అంటే, పెద్ద తప్పు అనే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవలికాలంలో కులాంతర వివాహం చేసుకున్న కొడుకుని ఒకలా.. కూతుళ్లను వేరేగా చూస్తున్నారు. ఆడపిల్లలు తక్కువ కావడమే ఇందుకు కారణం కావచ్చు.

ఇప్పటికి కూడా వేరే కులం వ్యక్తిని ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం అనేది తప్పుగా అన్వయిస్తున్నారు. ఈ దృక్కోణంలో మార్పులు రావాలనేది ప్రతీ ఒక్కరూ చెబుతోన్న మాట. అదే కులంలో చేసుకోక పోతే పరువు తక్కువ అంటూ.. సాంప్రదాయాలు, కట్టుబాట్లు పేరిట ఇంకా కూడా కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

లేటెస్ట్‌గా కులాంతర వివాహం చేసుకున్న జంటపై 28ఏళ్ల తర్వాత దాడి చేశారు. కర్ణాటకలో బెంగళూరుకు 385 కిలోమీటర్ల దూరంలోని గదగ్ జిల్లా రోన్‌తక్ ప్రాంతంలో 28 ఏళ్ల క్రితం ఓ జంట కులాంతర వివాహం చేసుకోగా.. దంపతులపై భర్త తరఫు బంధువులు దాడికి పాల్పడ్డారు. భర్త అగ్ర కులానికి చెందినవాడు కాగా, భార్య వాల్మీకి కులానికి చెందిన మహిళగా చెబుతున్నారు. ఈ కారణంతోనే భర్త బంధువులు వారిపై దాడికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. భార్యకు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.