IN Registration : వన్ నేషన్ వన్ పర్మిట్..దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు

వన్ నేషన్ వన్ పర్మిట్..విధానాన్ని తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

IN Registration : వన్ నేషన్ వన్ పర్మిట్..దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు

In

Vehicle Transfers : వన్ నేషన్ వన్ పర్మిట్..విధానాన్ని తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆధార్, వన్ రేషన్ – వన్ నేషన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకే సిరీస్ (IN నంబర్ ప్లేట్) తో వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలని యోచిస్తోంది. రాష్ట్రాలు మారినప్పుడల్లా..రిజిస్ట్రేషన్లు ఫీజులు, రోడ్ ట్యాక్స్ లు చెల్లించాల్సిన అవసరం ఉండదని, ఎలాంటి అదనపు రుసుం లేకుండా..ఇబ్బంది పడకుండా..వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

ఇందుకు ఓ పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులు, పీఎస్ యుఎస్, యాజమాన్యాల వాహనాలకు ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి..ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.
ఒక రాష్ట్రంలో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే..15 సంవత్సరాల రోడ్ ట్యాక్స్ ను ముందుగా చెల్లించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.

రెండు, మూడు సంవత్సరాల తర్వాత..వేరే రాష్ట్రానికి బదిలీ అయితే..మళ్లీ అక్కడ కూడా రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. దీంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. దీంతో కొత్త విధానం తీసుకరావాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఐఎన్ (IN) నంబర్ ప్లేట్ తో వాహనాల బదిలీ, రీ రిజిస్ట్రేషన్ చేయనున్నారు. రెండు సంవత్సరాలకు ఒకేసారి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో నే మొత్తం ప్రక్రియను పూర్తి చేసే విధంగా కార్యచరణను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా..పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

Read More : Covid Hospital : కోవిడ్ సెంటర్లో ఆ యువకుడి చేస్తున్న పనికి..ఆశ్చర్యపోయిన కలెక్టర్..అభినందించారు