Tamilnadu: దళితులకు ప్రవేశం ఇవ్వకపోవడంతో కాంట్రవర్సీ.. ఒక గుడి సీల్, మరొక గుడి తాత్కాలికంగా మూసివేత

వీరిలో 80 కుటుంబాలు షెడ్యూల్డ్ కులానికి చెందినవే. ఈ కుటుంబాలలో కొందరు తాము ఆలయంలో నిరంతరం కుల వివక్షను ఎదుర్కొంటున్నామని, ఇక వైకాసి పండుగ సమయంలో తమకు గుడిలో ప్రవేశించకుండా, సంబరాల్లో పాల్గొనకుండా అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు

Tamilnadu: దళితులకు ప్రవేశం ఇవ్వకపోవడంతో కాంట్రవర్సీ.. ఒక గుడి సీల్, మరొక గుడి తాత్కాలికంగా మూసివేత

Temple Sealed: తమిళనాడు రాష్ట్రంలో ఒక గుడికి సీల్ వేశారు, ఒక గుడిని తాత్కాలికంగా మూసివేశారు. కారణం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఆలయంలోకి రాకుండా కొందరు వ్యక్తులు ప్రవేశం నిరాకరించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సీల్ వేసిన గుడి తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయం కాదా, వీరనంపట్టిలోని కాళియమ్మన్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Birla Group jewellery : గోల్డ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బిర్లా గ్రూప్‌ .. రూ 5,000 కోట్లతో రిటైల్‌ స్టోర్లు

ద్రౌపది అమ్మన్ ఆలయానికి సంబంధించి ఆధిపత్య కులాలకు, దళితులకు మధ్య కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో దళితులకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించడంతో వివాదం చెలరేగింది. శాంతిభద్రతలు దెబ్బతింటాయిన భయపడ్డ జిల్లా అధికారులు బుధవారం ఆలయానికి సీలు వేశారు. వాస్తవానికి ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సమస్యపై సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు.

Rs 2k Notes: 50 శాతం రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చాయన్న ఆర్‭బీఐ గవర్నర్.. ఇంతకీ ఈ నోట్లను ఎలా మార్పుకోవాలంటే?

ఈ దేవాలయం హిందూ మత ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడని, దీనిపై ఆధిపత్య కులస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం దళితులను ఆలయంలోకి రానీయకుండా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ కారణంగా నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఆలయానికి అధికారులు సీల్ వేశారు. కాగా, కులమతాలకు అతీతంగా భక్తులందరినీ ఆలయంలోకి అనుమతించాలంటూ విల్లుపురం ఎంపీ డి.రవికుమార్‌, ఇతర పార్టీల నేతలంతా కలిసి సోమవారం జిల్లా కలెక్టర్‌ సి.పళనికి వినతి పత్రం సమర్పించారు.

Kolhapur Clashes: ఎన్నికల్లో గెలవడానికి ఔరంగజేబు కావాల్సి వచ్చిందా? షిండే, ఫడ్నవీస్‭లకు రౌత్ సూటి ప్రశ్న

ఇక కళియమ్మన్ ఆలయంలో ఇటీవల జరిగిన వైకాసి పండుగ సందర్భంగా తమను గుడిలోకి అనుమతించలేదని దళితులు పేర్కొన్నారు. అనంతరం అక్కడ గొడవ జరిగింది. కాళియమ్మన్ ఆలయం ఆ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అందులో కాళీ దేవి చెక్క విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం తమిళనాడు, పుదుచ్చేరి నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఏడాది వైకాసి పండుగ సందర్భంగా చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలకు చెందిన పలువురు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Assam : కరెంట్ బిల్లులు కట్టలేకపోతే ఫ్యాన్లు బంద్‌ చేసి చెట్ల కింద కూర్చోండీ : స్పీకర్‌ వ్యాఖ్యలు

వీరిలో 80 కుటుంబాలు షెడ్యూల్డ్ కులానికి చెందినవే. ఈ కుటుంబాలలో కొందరు తాము ఆలయంలో నిరంతరం కుల వివక్షను ఎదుర్కొంటున్నామని, ఇక వైకాసి పండుగ సమయంలో తమకు గుడిలో ప్రవేశించకుండా, సంబరాల్లో పాల్గొనకుండా అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. తమపై వివక్ష చూపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సమస్యను కడవూరు తహశీల్దార్ మునిరాజ్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఇరువర్గాలతో చర్చలు జరిపారు. అయితే, అవి విజయవంతం కాలేదు. దీంతో పరిష్కారం లభించే వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాన్ని ఎప్పుడు తెరుస్తారనే దానిపై ఆలయ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.