Waqf Board: పొలం అమ్మాలనుకున్న రైతుకు షాక్.. ఊరంతా మా భూమే అంటున్న వక్ఫ్ బోర్డ్.. ఆ ఊళ్లో పురాతన దేవాలయం కూడా

ఊరంతటికి షాక్ ఇచ్చింది తమిళనాడు వక్ఫ్ బోర్డు. ఊరు.. ఊరంతా తమదే అంటోంది. గ్రామంలో ఉన్న మొత్తం భూమి తమ బోర్డుకే చెందుతుందని డాక్యుమెంట్లు అందజేసింది. దీంతో అవసరానికి భూమి అమ్ముకుందామనుకున్న గ్రామ రైతుతోపాటు, ఊళ్లో వాళ్లంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Waqf Board: పొలం అమ్మాలనుకున్న రైతుకు షాక్.. ఊరంతా మా భూమే అంటున్న వక్ఫ్ బోర్డ్.. ఆ ఊళ్లో పురాతన దేవాలయం కూడా

Waqf Board: తమిళనాడులోని ఒక ఊరు మొత్తం తమ భూమే అంటోంది అక్కడి వక్ఫ్ బోర్డు. కానీ, చిత్రంగా ఆ ఊళ్లో 1,500 ఏళ్లనాటి దేవాలయం ఉంది. తమిళనాడు, తిరుచిరాపల్లి జిల్లాలో, కావేరీ నదీ తీరంలో తిరుచెంతురై అనే గ్రామం ఉంది. ఇటీవల ఈ గ్రామానికి చెందిన ఒక రైతు తన భూమిని అమ్మేందుకు స్థానిక రిజిష్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.

Hyderabad: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఘాతుకం

అయితే, ఆ ల్యాండ్ అమ్మడానికి లేదని ఆయన నోటీసు ఇచ్చాడు. కారణం.. ఆ భూమితోపాటు, మొత్తం ఊరంతా తమిళనాడు వక్ఫ్ బోర్డుకు చెందుతుందని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశాడు. దీని ప్రకారం.. ఆ ల్యాండ్ అమ్మాలంటే వక్ఫ్ బోర్డు అనుమతి తీసుకోవాలి. యాజమాన్య హక్కులు వక్ఫ్ బోర్డుకే ఉంటాయి. ఈ విషయం బయటపడటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీరికి ఇక్కడి భూముల్ని 1954లో ప్రభుత్వం కేటాయించింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. తాజాగా వక్ఫ్ బోర్డు విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులంతా షాక్‌కు గురయ్యారు. ఆ భూములు వక్ఫ్ బోర్డుకు ఎలా చెందుతాయని ప్రశ్నిస్తున్నారు.

Tamil Nadu Man: కువైట్‌లో దారుణం.. ఒంటెను చూసుకోలేదని తమిళనాడు వాసిని దారుణంగా చంపిన యజమాని

పైగా ఆ ఊరు పరిధిలో 1,500 ఏళ్లనాటి సుందరేశ్వర దేవాలయం కూడా ఉంది. వక్ఫ్ బోర్డు భూములు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవే ఉంటాయి. ఈ భూముల పరిధిలో హిందువులకు సంబంధించిన గుళ్లు వంటివి ఉండే అవకాశం లేదు. కానీ, ఇక్కడ గుడి ఉండటం వల్ల ఈ భూములకు, వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ ముస్లింలు నివసించినట్లు ఆనవాళ్లు కూడా లేవని వాళ్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం బయటపడటంతో తమ భూములు, ఊరి విషయంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.