Char Dham Yatra : చార్‌ధామ్ యాత్ర‌ తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్ లోని ఫేమస్ చార్‌ధామ్ యాత్ర‌ను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ సారి నిలిపివేయడానికి కారణం

Char Dham Yatra : చార్‌ధామ్ యాత్ర‌ తాత్కాలికంగా నిలిపివేత

Uk (1)

Char Dham Yatra  ఉత్తరాఖండ్ లోని ఫేమస్ చార్‌ధామ్ యాత్ర‌ను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ సారి నిలిపివేయడానికి కారణం కోవిడ్ కాదు. రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్నా భారీ వర్షాల కారణంగానే ఈ సారి చార్‌ధామ్ యాత్ర‌ నలిపివేయబడింది.

రాష్ట్రంలోని చార్‌ధామ్ దేవాలయాలను సందర్శించే భక్తులందరూ తమ పర్యటనను ఒకటి లేదా రెండు రోజులు వాయిదా వేసుకోవాలని సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు.  రాష్ట్రంలో వ‌ర్షాల‌పై ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించిన  సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి .. వాతావరణం అనుకూలించే వరకు భక్తులు తమ ప్రయాణాన్ని కొనసాగించవద్దని సూచించారు. పౌరి మరియు రుద్రప్రయాగ్ జిల్లాలో తాజా పరిస్థితులను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆ జిల్లాల మెజిస్ట్రేట్‌లను సీఎం ఆదేశించారు.

రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో వద్ద ఆదివారం 6000 మంది భక్తులు ఉండగా అందులో 4000 మంది తిరిగి వచ్చారు. 2000 మంది సురక్షిత ప్రదేశాలలో ఉన్నారు. రికార్డుల ప్రకారం, 20000 మందికి పైగా యాత్రికులు శనివారం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సీజన్‌లో ఇది అత్యధిక సంఖ్యలో సందర్శకులు. ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించేవారు జోషిమఠ్ మరియు పాండకేశ్వర్ మరియు చమోలిలో ఉంటున్నారని చమోలి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్ కె జోషి తెలిపారు.

యమునోత్రికి వెళ్లే యాత్రికులు బాద్‌కోట్ మరియు జంకిచట్టిలో ఉండాలని అధికారులు కోరారు. గంగోత్రికి వెళ్లేవారు హర్సిల్, భట్వారీ మరియు మానేరిలో ఉండాలని సూచించినట్లు ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.