బడ్జెట్ 2020 : రూ.5 లక్షలలోపు నో టాక్స్. రూ.7.5లక్షల వరకు 10% శాతం టాక్స్. షరతులు వర్తిస్తాయి.

  • Published By: venkaiahnaidu ,Published On : February 1, 2020 / 07:55 AM IST
బడ్జెట్ 2020 : రూ.5 లక్షలలోపు నో టాక్స్. రూ.7.5లక్షల వరకు 10% శాతం టాక్స్. షరతులు వర్తిస్తాయి.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గుదల. తగ్గింపులు మరియు మినహాయింపులను విరమించుకునే కొత్త వ్యక్తిగత ఆదాయ పన్ను పాలనను తగ్గిస్తామని నిర్మల సీతారామన్ చెప్పారు. 

5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను విధించబడదు. 2.5-5లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను ఉంటుంది. 5-7.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్ల నుంచి ప్రస్తుతం ఉన్న 20 శాతం రేటుతో కాకుండా.. ఇకపై కేవలం 10 శాతం మాత్రమే పన్ను  వసూలు చేయబడుతుందని ఆర్థికమంత్రి తెలిపారు. 7.5-10లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్లు 15శాతం మాత్రమే పన్ను చెల్లించవచ్చని ఆమె తెలిపారు. గతంలో ఇది 20శాతంగా ఉన్న విషయం తెలిసిందే. 10-12.5లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్లు గతంలో ఉన్న 30శాతం కాకుండా ఇకపై 20శాతం పన్ను మాత్రమే చెల్లించాల్పి ఉంటుందని ఆమె తెలిపారు.

12.5-15లక్షల మద్య ఆదాయం ఉన్నవాళ్లు గతంలో ఉన్న 30శాతం కాకుండా ఇకపై 25శాతం మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. 15లక్షలకు పైన ఆదాయం ఉన్నవాళ్లు 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిపాజిట్ బీమా కవరేజీని రూ .1 లక్ష నుండి రూ .5 లక్షలకు పెంచినట్లు ఆమె తెలిపారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా కొత్త పన్ను పథకం ఆప్షనల్ అని ఆమె తెలిపారు. పాత విధానంతో పాటు కొత్త పన్ను విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది.రెండు విధానాలు అమలులో ఉండనున్నాయి.

తగ్గింపులు మరియు మినహాయింపులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి కొత్త ఐ-టి పథకం అందుబాటులో ఉందని  సీతారామన్ చెప్పారు. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే80(c) కింద వచ్చే మినహాయింపులు రావు. ప్రస్తుత I-T చట్టం 100 కంటే ఎక్కువ తగ్గింపులు మరియు మినహాయింపులను అందిస్తుంది. ఆదాయ ప‌న్ను వసూళ్ల‌లో ఉన్న సుమారు 70 పాత విధానాల‌ను తీసివేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఇతర తగ్గింపులను హేతుబద్ధం చేస్తామని సీతారామన్ చెప్పారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డిడిటి) రద్దు చేయబడిందని, కంపెనీలు డిడిటి చెల్లించాల్సిన అవసరం ఇకపై లేదని ఆమె తెలిపారు. దీనివల్ల రూ .25 వేల కోట్ల ఆదాయం నష్టం అంచనా వేసినట్లు తెలిపారు. ఇది సాహసోపేతమైన చర్య అన్నారు. ఇది భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తుందని సీతారామన్ చెప్పారు.