DVAC Raids : మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు, విదేశీ కరెన్సీ, 4.9 కిలోల బంగారం స్వాధీనం!

అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం.

DVAC Raids : మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు, విదేశీ కరెన్సీ, 4.9 కిలోల బంగారం స్వాధీనం!

Taminladu

Minister Veeramani House : అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు సమాచారం. బెంగళూరుతో పాటు 35 ప్రాంతాల్లో 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం అకస్మికంగా తనిఖీలు జరిపారు. 34 లక్షలు, 1.8 లక్షల విదేశీ కరెన్సీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read More : Petrol And Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు

అంతేగాకుండా…4.9 కిలోల బంగారం, 47 గ్రాముల డైమండ్స్, 7.2 కిలోల వెండితో పాటు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో కలకలం సృష్టించింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయాంలో వీరమణి కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. ఆయన ఇళ్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలపై తనిఖీలు నిర్వహించారు. కోట్ల విలువైన ఆస్తిపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.