Income Tax: సంపులో కోటి రూపాయలు.. స్వాధీనం చేసుకున్న ఐటీశాఖ

ఆదాయపన్నుశాఖ అధికారుల కళ్లకు గంతలు గట్టి ప్రభుత్వ ఆదాయానికే గండికొడతామంటే చూస్తూ ఊరుకుంటారా?

Income Tax: సంపులో కోటి రూపాయలు.. స్వాధీనం చేసుకున్న ఐటీశాఖ

It Raids

Income Tax: ఆదాయపన్నుశాఖ అధికారుల కళ్లకు గంతలు గట్టి ప్రభుత్వ ఆదాయానికే గండికొడతామంటే చూస్తూ ఊరుకుంటారా? మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యాపారి అక్రమ సంపాదనను నిగ్గుతేల్చారు. శంకర్‌రాయ్‌ ఇంటిపై ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేయగా.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8 కోట్ల రూపాయలు లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీలు చేపట్టేందుకు వెళ్లిన ఐటీ అధికారులకు అవాక్కయ్యే సంఘటన ఎదురైంది. ఆదాయపు పన్ను అధికారుల రాకను చూసిన వ్యాపారి కోటి రూపాయల నగదును అండర్‌ గ్రౌండ్ వాటర్‌ ట్యాంకులో పడేశారు. దీనిని గుర్తించిన ఐటీ అధికారులు అండర్‌గ్రౌండ్ వాటర్‌ ట్యాంకులో దాచిన బ్యాగులో రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు.

సంపులో చిక్కిన కోటి రూపాయల నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన ఐటీ అధికారులు.. నోట్లను డ్రైయర్లతో ఆరబెట్టారు. ఇస్త్రీ కూడా చేశారు. 39గంటల పాటు కొనసాగిన ఈ తనిఖీల్లో శంకర్ రాయ్ నుంచి మొత్తం 8 కోట్ల నగదు, 5 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకొన్న పత్రాలు, ఆస్తులపై పేరులేకుండా ఉన్న విషయాన్ని కూడా గుర్తించినట్టుగా ఐటీ శాఖ అధికారులు చెప్పారు.

Pongal rush: సంక్రాంతి సందడి.. పట్నం వదిలి పల్లెలకు.. కాస్త భయం!

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. కోట్ల రూపాయలే కాదు.. కిలోల కొద్ది దొరికిన బంగారు నగలపై కూడా ఐటీశాఖ అధికారులు లెక్కలు లాగుతున్నారు. ఎవరి పేరుతో కొనుగోలు చేశారు.? ఎక్కడెక్కడ కొనుగోలు చేశారని ఆరా తీస్తున్నారు. వీటితో పాటు శంకర్‌ రాయ్‌ ఫ్యామిలీకి చెందిన వారి పేర్లతో ఎంత ఆస్తులు గురించి కూడా ఆరా తీస్తున్నారు.