iNCOVACC: జనవరిలో అందుబాటులోకి రానున్న నాసల్ వ్యాక్సిన్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ధర రూ.325

కోవిడ్‌కు సంబంధించి ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఎలాంటి నొప్పి లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదో మంచి చాయిస్. ‘ఇన్‌కోవాక్’ పేరుతో రానున్న ఈ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.

iNCOVACC: జనవరిలో అందుబాటులోకి రానున్న నాసల్ వ్యాక్సిన్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ధర రూ.325

iNCOVACC: కరోనాకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దేశంలో తొలిసారిగా నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి తేనుంది దేశీయ ఫార్మా సంస్థ ‘భారత్ బయోటెక్’. ఇప్పటివరకు ఉన్న కరోనా వ్యాక్సిన్లు అన్నీ ఇంజెక్షన్ల రూపంలో ఇచ్చేవే. అయితే, ఈ వ్యాక్సిన్‌ను మాత్రం ముక్కు ద్వారా ఇస్తారు.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

కోవిడ్‌కు సంబంధించి ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఎలాంటి నొప్పి లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదో మంచి చాయిస్. ‘ఇన్‌కోవాక్’ పేరుతో రానున్న ఈ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. దీంతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమైంది ‘ఇన్‌కోవాక్’. వచ్చే జనవరి నాలుగో వారం నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీన్ని అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.325, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.800కు ఈ వ్యాక్సిన్ అందిస్తారు. కోవిన్ పోర్టల్ ద్వారా ఈ వ్యాక్సిన్ బుక్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్లు ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీన్ని బూస్టర్ డోసుగా కూడా తీసుకోవచ్చు.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

ఇంతకుముందు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కూడా వాటి బదులుగా ‘ఇన్‌కోవాక్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన ఫేజ్-3 ట్రయల్స్ కూడా పూర్తైనట్లు కంపెనీ తెలిపింది. దేశంలోని అనేక కేంద్రాల్లో బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతోంది. ఇది కోవిడ్ నియంత్రణలో మరింత సమర్ధంగా పని చేస్తుందని బయోటెక్ సంస్థ ప్రకటించింది.