లీటర్ పాల ధర రూ.100.., మీరు వినేదాకా మేం తగ్గేదే లేదు

లీటర్ పాల ధర రూ.100.., మీరు వినేదాకా మేం తగ్గేదే లేదు

milk-prices-rise

Milk Rs 100 per litre: కాంట్రవర్షియల్ గా మారిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా హర్యానాలోని ఖాప్ పంచాయతీలు ధరలు పెంచేశాయి. గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీలకు అమ్మే లీటర్ పాల ధరను రూ.100కు నిర్ణయించాయి. పంచాయతీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మేం పాలను లీటర్ రూ.100కే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీలకు శచ్చే పాలను ఆ ధరకే ఇవ్వాలని డైరీ రైతులకు కూడా చెప్పేశాం’ అని అన్నారు.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా వినిపిస్తుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ.. తక్కువ ఇందనం ఉత్పత్తి చేసే దేశాలు ఎక్కువ లాభం పొందడానికే ధరలు పెంచినట్లు చెప్పారు. ఆ తర్వాతే ఈ నిరసన మొదలైంది.

ఇందన ధరలు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇందన ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఆ దేశాలు ఇందనాన్ని తక్కువ మోతాదులో తయారుచేసి ఎక్కువ లాభం పొందాలనుకుని రేట్లు పెంచారు. ఇది వినియోగగారుడ్ని బాగా ఇబ్బందిపెడుతుందని మంత్రి ప్రధాన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు 11రౌండ్ల పాటు జరిగాయి. 2020 నవంబర్ 26 నుంచి దేశ రాజధానిలో పలు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. Farmers’ Produce Trade and Commerce Act 2020; Farmers Agreement of Price Assurance and Farm Services Act 2020, Essential Commodities Act, 2020లపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.