మరో టెన్షన్.. కరోనా రోగులలో డెంగ్యూ, మలేరియా లక్షణాలు

  • Published By: vamsi ,Published On : September 6, 2020 / 12:41 PM IST
మరో టెన్షన్.. కరోనా రోగులలో డెంగ్యూ, మలేరియా లక్షణాలు

ఇప్పటికే దేశం కరోనా కారణంగా అతలాకతలం అయిపోతూ ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఇప్పటికే నలభై లక్షలు దాటిపోగా.. కరోనా వైరస్ రోగుల సంఖ్య రికార్డు స్థాయిలో బ్రెజిల్‌ను కూడా దాటి పోయింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90 వేల 632 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటివరకు ఒకే రోజులో కరోనా కేసులో అత్యధికం.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి సోకిన రోగులలో డెంగ్యూ మరియు మలేరియా లక్షణాలు కూడా కనిపించడం ఇప్పుడు డాక్టర్లలో ఆందోళన కలిగిస్తున్నది. ఒక వైపు, కరోనా వైరస్ సంక్రమణ వేగంగా పెరుగుతుండగా, మరోవైపు, ఇప్పుడు ఈ సమస్య వైద్యుల ముందు సవాల్‌గా మారింది. ఢిల్లీలోని రెండు ఆసుపత్రులలో రోగి లోపల కరోనాతో పాటు డెంగ్యూ లేదా మలేరియా లక్షణాలను వైద్యులు కనుగొన్నారు. రోగులలో కనిపించే ఈ డబుల్ వ్యాధి వైద్యులను ఇబ్బందుల్లో పడేస్తుంది.

ప్రతి సంవత్సరం దోమలు వ్యాప్తి కారణంగా పెరుగుతున్న వ్యాధుల సంఖ్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఢిల్లీలోని ఆసుపత్రుల నుంచి వస్తున్న నివేదికలు ప్రభుత్వం ముందు కొత్త సవాలు వేస్తుంది. ఒక వైపు, ప్రజలను కరోనా నుండి రక్షించాల్సి ఉండగా, మరోవైపు, మలేరియా, డెంగ్యూ మరియు లెప్టోస్పిరోసిస్ వంటి ఇన్ఫెక్షన్లను కూడా నివారించాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టింగ్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ రాజేష్ చావ్లా మాట్లాడుతూ, కోవిడ్ -19 పాజిటివ్ ఉన్న 30 ఏళ్ల రోగిలో మలేరియా లక్షణాలు, డెంగ్యూ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. అటువంటి పరిస్థితిలో, ఒకే రోగికి మూడు రకాల ఇన్ఫెక్షన్ వచ్చిన తరువాత, అతన్ని రక్షించడం కష్టమైందని అన్నారు.

ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం మేము మొదట రోగిని కోవిడ్ -19 కోసం పరీక్షించాము. తదనుగుణంగా చికిత్స చేయటం ప్రారంభించామ. అయితే తరువాత, రోగికి డెంగ్యూ మరియు మలేరియా కూడా ఉన్నట్లు గుర్తించాము. దీని కారణంగా అతనికి చికిత్స చెయ్యడం కష్టమైందని అతను మరణించాడని చెప్పారు. ఇప్పుడు దేశంలో మలేరియా, డెంగ్యూలు వ్యాపించే సీజన్ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.