కరోనా టైంలో 74వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా..

కరోనా టైంలో 74వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్  ఎలా..

బ్రిటీష్ వారి పాలన నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 2020 ఆగష్టు 15 నాటికి సరిగ్గా 74 ఏళ్లు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంతో జరుపుకోవడానికి కరోనా వైరస్ ఆటంకంగా మారింది. సామూహిక సెలబ్రేషన్స ఏమీ లేకపోవడంతో.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకలను వెబ్ కాస్ట్ చేయాలనుకుంటున్నాయి.

ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ రోజు ఎర్ర కోట వేదికగా జరుపుకునే జెండా వందన కార్యక్రమానికి కూడా పరిమిత సంఖ్యలోనే హాజరుకానున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిలటరీ బ్యాండ్లతో గ్రాండ్ పర్‌ఫార్మెన్స్‌లు లాంటివి లేకుండా చూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ.. జాతీయ గీతాలు పాడి, డ్యాన్సులు వేసి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేవాళ్లం.

చరిత్ర:
1757 నుంచి అంటే దాదాపు 200 సంవత్సరాల పాటు ఇండియన్లు బ్రిటీషుల ఆధిపత్యాన్ని అనుభవించారు. ప్లాస్సీ యుద్ధంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయంతో ఇండియాపై కంట్రోల్ సాధించారు.

బ్రిటీషర్లను వెల్లగొట్టేందుకు పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు చేసి 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. ఆ రోజు ఇండియన్లకు అధికారం తప్పక ఇవ్వాల్సి వచ్చింది. అదే రోజు బ్రిటిషులు పాలించిన ఇండియా.. రెండు దేశాలుగా విడిపోయింది. అదే ఇండియా, పాకిస్తాన్.

బ్రిటిషులు డివైడ్ అండ్ రూల్ పాలసీలో సక్సెస్ అయ్యారు. ముస్లింలు, హిందువుల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చారు. 1947 ఆగష్టు 14 సాయంత్రం హింసాత్మక ఆందోళనల తర్వాత 15 మిలియన్ మంది వరకూ విడిపోయి ప్రత్యేక దేశం ఏర్పడింది.

ఇండిపెండెన్స్ డే అనేది ప్రాణాలకు తెగించి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వీరుల త్యాగాలకు చిహ్నం. ఆ ఫలితంగానే తర్వాత జనరేషన్లు… స్వేచ్ఛాగాలులు పీల్చుకోగల్గుతున్నారు. 200 సంవత్సరాల బానిసత్వం తర్వాత దేశాన్ని గొప్ప నాయకుల అధికారంలోకి వచ్చేలా చేసింది.

1947 ఆగష్టు 15న స్వాతంత్య భారతావనికి తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా త్రివర్ణ పతాకం ఎగరేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని అనుసరిస్తూ.. ఇప్పటి వరకూ జెండా వందన మహోత్సవాన్ని ప్రధాని చేతుల మీదుగా నిర్వహిస్తూనే ఉన్నారు.

ఇండియన్ ఆర్మీ యొక్క పలు బెటాలియన్లు కలిసి నేషనల్ పరేడ్ నిర్వహిస్తూ వస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి జరగకూడదని డిఫెన్స్ మినిస్ట్రీ ఈ ప్రదర్శనను చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వడానికి బదులు దీనినే టెలికాస్ట్ చేయనున్నారు.

ఇండిపెండెన్స్ డేకు ప్రతీకగా గాలిపటాలు ఎగరేసి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరైతే వారి జాతీయతను చాటుకోవడానికి ఇళ్లపై త్రివర్ణ పతాక రంగులను పెయింటింగ్ గా వేయించుకుంటూంటారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఇండిపెండెన్స్ డేను జరుపుకుంటుంటారు. యునైటెడ్ స్టేట్స్ లోని కొన్ని నగరాల్లో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇండియా డేగా డిక్లేర్ చేశారు.