PM Narendra Modi : సెల్యూట్, జెండా ఆవిష్కరించిన మోదీ..హెలికాప్టర్ల పూల వర్షం

ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. అక్కడి వేదికపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు పీఎం మోదీ.

PM Narendra Modi : సెల్యూట్, జెండా ఆవిష్కరించిన మోదీ..హెలికాప్టర్ల పూల వర్షం

Modi

Independence Day 2021 : ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రులు అజయ్‌భట్‌, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌లు సంయుక్తంగా ఆహ్వానించారు. త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించాక మోదీ ఎర్రకోట బురుజు పైకి వెళ్లారు. అక్కడి వేదికపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే భారతీయ వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. కోవిడ్ నిబంధనల మధ్య స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి.

Read More : Taliban: తాలిబాన్ల దండయాత్ర.. కాబూల్‌కు ఏడు మైళ్లే.. 20రాజధానులు స్వాధీనం

ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ 8వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎర్రకోటను అందంగా ముస్తాబు చేశారు. దేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమృతోత్సవానికి ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత నీరజ్‌ చోప్రాతో పాటు, మొత్తం 32 మంది ఒలింపిక్స్‌ ప్రస్తుత, గత విజేతలు, ఇద్దరు భారత క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన 240 మంది క్రీడాకారులు, సహాయ సిబ్బంది, స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ అధికారులు కూడా ఎర్రకోటకు వచ్చారు. ఎర్రకోట బురుజులపై నుంచి మోదీ ప్రసంగం అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్లు జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన 500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

Read More : Goa: పంద్రాగస్టు రోజున వేడుకలు జరుపుకోని గోవా.. ఎందుకో తెలుసా?

స్వాతంత్ర్య వేడుకల్లో ఉగ్రదాడుల జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. దేశ సరిహద్దులు, సముద్ర తీర ప్రాంతాలు, రాజధాని నగరం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట పరిసరాల్లో ఎన్‌ఎస్‌జీ, స్వాట్ కమాండోలు, షార్ప్ షూటర్లు, కైట్ కాచర్లను ఎత్తయిన భవనాల్లో మోహరించారు. డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఎర్రకోటలో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటుచేశారు. 5 వేల మంది పోలీసులను మోహరించారు.