Anti-Covid Pill : మరో రెండు కొత్త వ్యాక్సిన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

భారత్‌లో మరో రెండు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో మరో రెండు వ్యాక్సిన్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.

Anti-Covid Pill : మరో రెండు కొత్త వ్యాక్సిన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

India Approves Anti Covid Pill, 2 New Vaccines For Emergency Use

Anti-Covid pill : భారత్‌లో మరో రెండు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో మరో రెండు వ్యాక్సిన్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. సీరం సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ Covovax, హైదరాబాద్ కంపెనీ బయోలాజికల్‌-ఈ (Biological E) తయారు చేసిన Corbevax, అలాగే యాంటీ కోవిడ్ పిల్ (Molnpiravir) మూడింటిని అత్యవసర వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ‘కొవొవాక్స్‌’, ‘బయోలాజికల్‌-ఈ’కి చెందిన చేసిన కార్బెవాక్స్‌కు అనుమతుల కోసం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సీరం సంస్థ గత అక్టోబర్‌లోనే అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి కోవోవాక్స్‌ అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది.

ఇదివరకే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించి డేటాను సమర్పించింది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి వ్యాక్సిన్ సాంకేతికతతో సీరం ‘కొవొవాక్స్‌’ టీకాను అభివృద్ధి చేసింది. సమీక్ష అనంతరం ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


మరోవైపు.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఒకవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరింత వేగవంతమైంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జనవరి 1 నుంచి కోవిన్‌ (COWIN) లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే.. దేశంలో సీరంకు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌ కోవ్యాక్సిన్ వినియోగంలో ఉండగా.. రష్యాకు చెందిన స్ఫూత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Read Also : Procurement Of Grain : తెలంగాణ నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణను పెంచిన కేంద్రం