చైనాకు మరో ఝలక్…ఏసీలు,రిఫ్రిజిరెంట్స్ దిగుమతిపై నిషేధం

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2020 / 02:47 PM IST
చైనాకు మరో ఝలక్…ఏసీలు,రిఫ్రిజిరెంట్స్ దిగుమతిపై నిషేధం

India bans import of ACs with refrigerants చైనాకు మరో ఝలక్ ఇచ్చింది మోడీ సర్కార్. బోర్డర్ లో రెచ్చిపోతున్న చైనాను దారిలోకి తెచ్చేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ పాలసీ కింద దేశీయ ఉత్పత్తిని ప్రొత్సహించాలన్న ఉద్దేశ్యంతో మరియు అత్యవసరం కాని దిగుమతులను తగ్గించుకోవడంలో భాగంగా…విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఏసీలు, రిఫ్రిజిరెంట్స్ ను కేంద్రం నిషేధించింది.



ఈ మేరకు దిగుమతి విధానాన్ని(Import policy)ని సవరిస్తూ గురువారం(అక్టోబర్-16,2020) డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్ ఫారెన్‌ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా,ఇటీవల కాలంలో అనేకరాల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.



కాగా, పరోక్షంగా చైనాను లక్ష్యంగా చేసుకునే తాజా నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ కు ఏసీలు, రిఫ్రిజిరెంట్స్ ను ఎక్స్ పోర్ట్ చేసే దేశాలుగా చైనా,థాయ్ లాండ్ లు ఉన్నాయి. గత ఆర్థిక త్రైమాసికంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏసీలు, రిఫ్రిజిరేట్ల విలువ దాదాపు 158.87 మిలియన్‌ డాలర్లు కాగా… ఇందులో దాదాపు 97 శాతంపైగా చైనా, థాయిలాండ్‌ నుంచే ఉన్నాయి.

లడఖ్ సరిహద్దుల్లో నాటకాలాడుతున్న చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌ల వాడకంపై నిషేధం విధించిన భారత్… ఇప్పుడు దిగుమతి విధానాన్ని సవరించి చైనాపై మరింత ఒత్తిడి పెంచిదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.