ప్రైవేట్ వీడియోలు లీక్.. యువతి ఆత్మహత్య.. ప్రియుడే సూత్రధారి

  • Published By: vamsi ,Published On : March 10, 2020 / 01:27 PM IST
ప్రైవేట్ వీడియోలు లీక్.. యువతి ఆత్మహత్య.. ప్రియుడే సూత్రధారి

మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకుని వస్తున్నా కూడా ఆచరణలో చట్టాలు అమలు అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. చట్టాలు సంగతి పక్కనబెడితే.. మగువలు కూడా కొందరు చేతులారా చిన్న చిన్న తప్పులు చేసి వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఓ మైనర్ బాలిక చేసిన పనికి చివరకు తన ప్రాణాలను కోల్పోయింది. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమించినవాడు చేసిన మోసానికి చివరకు యువతి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఓ 16ఏళ్ల యువతి యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమించిన యువకుడిని నమ్మి అతనితో రహస్యంగా గడుపింది. అయితే ఆమెతో రహస్యంగా గడిపిన సంధర్భాలను యువకుడు వీడియో తీశాడు. ఫోన్ కెమెరాలో బంధించిన వీడియోలను యువకుడు తన స్నేహితుడికి పంపాడు. ఆ స్నేహితుడు మరొకనికి, అలా అనేకమంది ఆ వీడియోలు వెళ్లగా.. చివరకు తల్లదండ్రులకు విషయం తెలిసింది. 

దాంతో తల్లదండ్రులు విషయంపై పోలీసులకు కంప్లైంట్ చెయ్యగా..  అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ప్రియుడిని అదుపుకులోకి తీసుకుని, పోక్సో వంటి చట్టాల కింద కేసు నమోదు చేశారు. అలాగే వీడియోలు షేర్ చేసుకున్న ప్రియుడి స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.