India Agri Exporters : ప్రపంచ వ్యవసాయ ఎగుమతిదారుల టాప్ 10 జాబితాలో భారత్!

గత 25 ఏళ్లలో ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నివేదిక ప్రకారం.. 2019లో భారత్ టాప్ 10 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల జాబితాలోకి ప్రవేశించింది.

India Agri Exporters : ప్రపంచ వ్యవసాయ ఎగుమతిదారుల టాప్ 10 జాబితాలో భారత్!

India Breaks Into The Top 10 List Of Agri Produce Exporters

India top 10 list of agri produce exporters : గత 25 ఏళ్లలో ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నివేదిక ప్రకారం.. 2019లో టాప్ 10 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల జాబితాలోకి భారత్‌కు చోటు దక్కింది. బియ్యం, సోయా బీన్స్, పత్తి, మాంసం ఎగుమతిలో భారత్ గణనీయమైన వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 2019లో భారత్ 3.1 శాతం వాటాను కలిగి ఉన్నట్టు నివేదిక తెలిపింది. మెక్సికో 3.4 శాతం, బ్రెజిల్ 7.8 శాతం, చైనా 5.4 శాతం, అమెరికా 13.8 శాతం వాటాను ఆర్జించింది.

2019లో మెక్సికో, భారత్ ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో వరుసగా 3.4శాతం, 3.1శాతం వాటాను కలిగి ఉన్నాయి. మలేషియా (7వ), న్యూజిలాండ్ (9వ) స్థానంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా నిలిచాయి. 1995లో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా (22.2శాతం)తో 2019లో యూరోపియన్ యూనియన్ (16.1శాతం)తో అధిగమించింది. అమెరికా వాటా 2019లో 13.8 శాతానికి పడిపోయింది. బ్రెజిల్ మూడవ అతిపెద్ద ఎగుమతిదారుగా తన ర్యాంకును కొనసాగించింది. 1995లో 4.8శాతం నుంచి 2019లో 7.8 శాతానికి పెరిగింది. చైనా 1995లో ఆరవ స్థానం (4శాతం) నుంచి 2019లో (5.4శాతం)తో నాల్గవ స్థానానికి చేరుకుంది.

బియ్యం ఎగుమతుల విషయానికొస్తే.. 1995లో, థాయిలాండ్ 38 శాతం వాటాను కలిగి ఉండగా.. భారత్, అమెరికా వరుసగా 26 శాతం, 19 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2019లో, భారత్ తన వాటాను 33 శాతానికి పెంచడం ద్వారా థాయిలాండ్‌ను అధిగమించింది. 2019లో థాయిలాండ్ వాటా 20 శాతానికి తగ్గింది. పత్తి ఎగుమతిలో కూడా టాప్ 10లో భారత్ ఉంది. దీని వాటా 7.6 శాతంగా ఉంది. 1995లో టాప్ 10 ఎగుమతిదారులలో ఉండగా.. ప్రస్తుతం నాల్గవ స్థానంలో నిలిచింది. అత్యధికంగా సోయా బీన్‌ ఎగుమతిలో భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది. దాని వాటా ఎగుమతులు 0.1 శాతం వద్ద తక్కువగా ఉన్నాయి. మాంసం ఎగుమతుల్లో ప్రపంచ వాణిజ్యంలో 4 శాతం వాటాతో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.