Russian crude: ఆ విషయంలో చైనాను వెనక్కి నెట్టి నెంబర్ ‌వన్‌గా నిలిచిన భారత్

రష్యన్ ముడి చమురు అయిన ఈఎస్‌పీఓ దిగుమతుల్ని భారీగా పెంచింది భారత్. రష్యా నుంచి గతంలో చైనా ఎక్కువగా ఈ రకం చమురును కొనేది. కానీ, ఇప్పుడు భారత్ ఈ చమురును అధికంగా కొంటోంది. ఈ విషయంలో చైనాను దాటిన భారత్ మొదటి స్థానంలో నిలిచింది.

Russian crude: ఆ విషయంలో చైనాను వెనక్కి నెట్టి నెంబర్ ‌వన్‌గా నిలిచిన భారత్

Russian crude: రష్యా నుంచి చమురు దిగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న చైనాను భారత్ వెనక్కు నెట్టింది. గత ఆగష్టులో భారీ స్థాయిలో ముడి చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఈఎస్‌పీఓగా పిలిచే, రష్యన్ ముడి చమురు.. ఆరు నౌకల్లో భారత్‌లోని రిఫైనరీలకు చేరినట్లు భారత వ్యాపారవర్గాలు తెలిపాయి. భారత్ ఈ స్థాయిలో ఒకేసారి ఇంత ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.

Surat: నోటి నుంచి మంట పుట్టించేందుకు ప్రయత్నం.. ఒళ్లంతా అంటుకున్న మంటలు.. వీడియో వైరల్

మన దేశ నెలవారీ దిగుమతుల్లో ఇది ఐదింట ఒక వంతు (20 శాతం) కావడం గమనార్హం. కొన్నేళ్లుగా భారత్ ఈ తరహా ముడి చమురును అంతగా దిగుమతి చేసుకోలేదని, అయితే ఇప్పుడు మాత్రం భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటోందని ఈ రంగంతో సంబంధమున్న వ్యాపారులు అంటున్నారు. ఈ చమురు భారత్ చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని, అయితే ధరలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయని వారు అంటున్నారు. ఇటీవల ఉక్రెయిన్‪పై రష్యా యుద్ధానికి దిగడంతో అమెరికాతోపాటు, యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనాతోపాటు మన దేశానికి కూడా తక్కువ ధరకే చమురు అందించాలని రష్యా నిర్ణయించింది. గతంలోకంటే తక్కువ ధరకే చమురు వస్తుండటంతో భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

Nirmala Sitharaman: ప్రాజెక్టుల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లుగా పెంచారు.. తెలంగాణ ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ ఫైర్

ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనే అతిపెద్ద దిగుమతిదారుగా మారింది భారత్. చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్.. ముందుగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచింది. ఆ తర్వాత ఈఎస్‌‌పీవో కోసం పోటీపడుతోంది. వాస్తవానికి ఈఎస్‌పీవో రకం ముడి చమురు విషయంలో భారత్ అంతగా ఆసక్తి చూపేది కాదు. చైనా ఎక్కువగా ఈ చమురును కొనేది. కానీ, ఇప్పుడు చైనాను మించి భారత్ ఈ చమురును కొంటోంది. ఈ విషయంలో చైనాను దాటి భారత్ మొదటి స్థానంలో నిలిచింది.