ట్రంప్ పర్యటనలో కీలక ఒప్పందం ఇదే

  • Published By: vamsi ,Published On : February 24, 2020 / 04:00 PM IST
ట్రంప్ పర్యటనలో కీలక ఒప్పందం ఇదే

అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనలో కీలకమైన రక్షణ ఒప్పందం.. వాణిజ్య ఒప్పందంలపై సంతకాలు జరగనున్నాయి. డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వం రక్షణ ఒప్పందాలకు సంబంధించి అమెరికాతో 2.6 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇదే ట్రంప్ పర్యటనలో కీలక ఒప్పంందం. ఈ ఒప్పందంలో భాగంగా 24 ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది.

ఈ డీల్‌కు సంబంధించి అమెరికా నుంచి లెటర్ ఆఫ్ అగ్రీమెంట్ కూడా ఇప్పటికే అందింది. ఈ డీల్ ది ఫారిన్ మిలిటరీ సేల్ నియమాలను అనుసరించి జరుగుతోంది. ఈ డీల్‌లో భాగంగా దాదాపు రూ.18690 కోట్ల విలువ చేసే 24 ఎంహెచ్‌-60 రోమియో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్ల ప్రత్యేకతలు:
భారత నేవీ త్వరలో MH-60 మల్టీ-రోల్ రోమియో సికోర్స్కీ హెలికాప్టర్లను కలిగి ఉంటుంది, ఇది హిందూ మహాసముద్రం ప్రాంతం(IOR)లో భారత్ పాత్రను విస్తరించడంలో ఉపయోగపడుతుంది.
ఈ హెలికప్టర్లతో భారత్ నావికా దళం బలం మరింత పెరుగుతుంది.
వీటిని ముఖ్యంగా సబ్‌మెరైన్‌లను ధ్వంసం చేసేందుకు ఉపయోగిస్తారు.
ఇందులో సబ్‌మెరైన్‌ను ధ్వంసం చేసేందుకు యాంటీ సబ్‌మెరైన్ టార్పెడోలు ఉంటాయి.
ముఖ్యంగా భారత మహా సముద్రంలో తిరిగే శత్రు(చైనా) సబ్‌మెరైన్లను ధ్వంసం చేసేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయి.
రోమియో హెలికాప్టర్లలో అత్యాధునిక రాడార్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి నావిక దళం  రాడార్ పరిమితిని దాటి శత్రు సబ్‌మెరైన్ లొకేషన్‌ని పసిగట్టడానికి ఉపయోగపడతాయి.
ఇది హెవీ లిఫ్ట్ హెలీకాప్టర్ కావడంతో బలమైన యుద్ధ యంత్రాలను మోయగలదు.

అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ గ్రూప్ నుంచి 24 ఎంహెచ్ -60 ఆర్ 24 ఎంహెచ్ -60 ఆర్ సీహాక్ మారిటైమ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది భారత్