అనేక ప్రథమాలతో…71వ రిపబ్లిక్ డే వేడుకలు

10TV Telugu News

భారతదేశ వ్యాప్తంగా 71వ రిపబ్డిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే రోజున మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి…భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవడం మొదలైంది. దేశ రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ మెసాయిస్ బొల్సొనారో ముఖ్య అతిథిగా హాజరైన ఈ 71వ రిపబ్లిక్ డే కు ఓ ప్రత్యేకను కలిగి ఉంది. ఈ సంవత్సరం వేడుక అనేక ప్రథమాలతో(మొదటిసారి) గుర్తించబడింది.

మొదటిసారిగా…

>భారత అమ్ములపొదిలో ఇటీవల చేరిన విదేశాల నుండి కొనుగోలు చేసిన హెవీ హెలికాప్టర్ చినూక్, హెలికాప్టర్ అపాచీల విన్యాసాలు తొలిసారిగా పరేడ్ వేదికగా కనువిందు చేశాయి. చినూక్ హెలికాప్టర్‌ను రిమోట్ లొకేషన్స్‌లో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధం చేశారు. భారీ బరువులను మోయడంతో పాటు ఎక్కడికైనా వెళ్లగలదు. డిజాస్టర్ రిలీఫ్ లేదా భారీ మిషన్లు లాంటి ఘటనలలో వీటిని వాడతారు. మరోవైపు అపాచీ హెలికాప్టర్ గాలిలో ఉండే గాలిలో శత్రువులపై, నేలపై ఉన్నవారిపైనా దాడులు జరపడానికి ఉపయోగిస్తారు. రాకెట్లు, ఫ్రంట్ గన్ లాంటి ఆయుధాలు దీనిలో ఇన్‌ బిల్ట్‌గా ఉంటాయి.

>ఇండియా గేట్ దగ్గర ఉన్న అమరజవాన్ జ్యోతి దగ్గర కాకుండా  మొదటిసారిగా భారత ప్రధానమంత్రి నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమరజవాన్లకు నివాళులర్పించారు. గతేడాది ఫిబ్రవరిలో ఇండియా గేట్ కు దగ్గర్లో నిర్మించిన జాతీయ యుద్ధ సార్మకం(నేషనల్ వార్ మెమోరియల్)ను ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్యం అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు గుర్తుగా ఈ మెమోరియల్ నిర్మించబడింది.

>తొలిసారిగా పారామిలిటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క మహిళా బైకర్ల బృందం డేర్ డెవిల్ స్టంట్స్ ప్రదర్శించింది. దీనికి ఇన్ స్పెక్టర్ సీమా నాగ్ నాయకత్వం వహించింది. 

> రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారిగా కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యొక్క బృందం మార్చింగ్ చేసింది.

అయితే పరేడ్ షో టాపర్స్ లో…భారతదేశం యొక్క ఉపగ్రహ నిరోధక ఆయుధాలు (ASAT) ఒకటిగా నిలిచింది. గత మార్చిలో ASATవిజయవంతంగా పరీక్షించబడిన విషయం తెలిసిందే.

×