చైనా బోర్డర్‌లో మళ్లీ టెంపరేచర్ పెరుగుతోంది. ఇండియా సిద్ధంగా ఉందా?

చైనా బోర్డర్‌లో మళ్లీ టెంపరేచర్ పెరుగుతోంది. ఇండియా సిద్ధంగా ఉందా?

ఇండియా సైలెంట్‌గానే ఉన్నా… చైనా కవ్వింపులతో రెచ్చగొట్టాలని చూస్తోంది.. LAC వెంబడి.. చైనా ఫైటర్ జెట్స్ మోహరిస్తోంది.. భారత్ అన్నీ గమనిస్తూనే ఉంది. చర్చలు కంటిన్యూ అవుతున్నాయ్.. పరిష్కారం కోసం హిందుస్థాన్ వెయిట్ చేస్తూనే ఉంది. అలాగని.. సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన.. సన్నద్ధంగా లేదని కాదు. భారత్.. చైనా కంటే స్ట్రాంగ్‌గా, రెడీగా ఉంది బోర్డర్‌లో. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి హెలికాప్టర్లను మోహరించి.. చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది.

అంతేకాదు.. చైనా సొంతంగా తయారుచేసుకున్న ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ జే-20 యుద్ధవిమానాలను కూడా.. LACకి అతి దగ్గరలో ఉన్న హోటాన్ ఎయిర్‌బేస్‌లో మోహరించింది. వీటితో పాటు మరిన్ని ఫైటర్ జెట్స్, బాంబర్స్, డ్రోన్స్, ఎయిర్‌బోన్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని కూడా సిద్ధంగా ఉంచి. ఈ హోటాన్ ఎయిర్‌బేస్.. ఎల్ఏసికి 250 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఫింగర్ ఫోర్, పాంగాంగ్ సో సరస్సుకి.. 380 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత 6 నెలలుగా.. చైనా ఈ హోటాన్ ఎయిర్‌బేస్‌లో యుద్ధ విమానాలను మొహరిస్తోంది.

భారత్‌లోని శత్రుదుర్భేధ్యమైన మిలటరీ బేస్‌ల మీద కూడా చైనా ఓ కన్నేసి ఉంచింది. ఎప్పటికప్పుడు.. ఇండియన్ ఆర్మీ కదలికలను గమనించే ప్రయత్నం చేస్తోంది. అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌బేస్, ఒడిశా తీరంలోని.. మిస్సైల్ టెస్టింగ్ సెంటర్.. అబ్దుల్ కలాం ఐల్యాండ్‌ని చైనా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రెండు ప్రదేశాలు.. భారత్‌కు వ్యూహాత్మక, సైనిక సామర్థ్యాలకు చాలా కీలకమైనవి. మయన్మార్ సరిహద్దులో ఉన్న యునాన్ ప్రావిన్స్‌లోని రుయిలీ కౌంటీ నుంచి చైనా ఈ కీలకమైన ప్రదేశాలని గమనిస్తోంది.
ఇండో-చైనా బోర్డర్‌కు 170 కిలోమీటర్ల దూరంలో.. తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ ఉంటుంది.

సరిహద్దుల్లో.. ఎలాంటి సవాల్‌కైనా తేజ్‌పూర్ బేస్ సిద్ధంగా ఉందని.. ఈ మధ్యే ఐఏఎఫ్ ప్రకటించింది. దీంతో.. చైనా దీనిపైనే ఇప్పుడు ఫోకస్ పెట్టింది. భారత బలగాలు కూడా చైనాకు గట్టి సమాధానం చెప్పేందుకు సన్నద్ధంగానే ఉన్నాయ్. ఎక్కడికైనా మోసుకుపోగలిగే పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల్ని.. LAC వెంట మంచుకొండలపై మోహరించాయ్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇగ్లా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని.. కీలక స్థావరాలతో పాటు అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో మోహరించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
సైనికులు భుజం మీద మోస్తూనే ఈ క్షిపణులతో శత్రువులపై గుళ్ల వర్షం కురిపించవచ్చు. ఈ పోర్టబుల్ ఇగ్లా మిస్సైల్ సిస్టమ్‌ని.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ వినియోగిస్తాయి. ఆకాశంలో ఎగురుతున్న శత్రు విమానాలు, హెలికాప్టర్లను వీటితో చాలా ఈజీగా పేల్చేయొచ్చు.

ఎల్‌ఏసీ వెంట బలగాల ఉపసంహరణకు చర్చలు జరుగుతుండగానే.. చైనా యుద్ధ హెలికాప్టర్లను తూర్పు లద్దాఖ్‌లో మోహరించింది. గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్-14తో పాటు పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో.. డ్రాగన్ హెలికాప్టర్లు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. దీంతో.. అప్రమత్తమైన భారత్.. గగనతలాన్ని శత్రుదుర్భేధ్యంగా మార్చింది. సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు.. అడ్వాన్స్‌డ్ రాడార్ల ద్వారా నిఘా పెంచారు.

భూమిపై నుంచే గగనతలంలో జరిగే ప్రతీ కదలికను పసిగడుతున్నారు. ఉపరితలం నుంచే.. ఆకాశంలోని టార్గెట్లను ఫినిష్ చేసేందుకు.. మిస్సైల్స్‌ని కూడా మోహరించారు.
చైనాతో సరిహద్దు ఘర్షణల తర్వాత.. లద్దాఖ్ ప్రాంతం అత్యంత కీలకంగా మారింది. దీంతో.. ఏడాది మొత్తం లద్దాఖ్‌కు సాఫీగా రాకపోకలు సాగించే రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన భూభాగంతో లద్దాఖ్‌ను లింక్ చేస్తూ.. ప్రస్తుతం రెండు రోడ్డు మార్గాలున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని జోజిలా కనుమగుండా ఒకటి.. హిమాచల్‌లోని మనాలి-లేహ్ మార్గం మరొకటి.

ఈ రెండు మార్గాలు వింటర్ సీజన్‌లో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. దాదాపు ఆరు నెలలు మూసేసి ఉంటాయి. దీంతో.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది మొత్తం రాకపోకలు సాగించేలా.. మరో రోడ్డు నిర్మిస్తోంది కేంద్రం.
ఇండో-చైనా బోర్డర్ క్లాష్ నేపథ్యంలో.. హిమాచల్ ప్రదేశ్‌లోని డార్చాను.. లద్దాఖ్‌తో కలిపే వ్యూహాత్మక రోడ్డు పనులను భారత్ శరవేగంగా పూర్తిచేయాలని నిర్ణయించింది. ఇది.. అనేక ఎత్తైన మంచు రహదారులను దాటుతుందని అధికారిక వర్గాలు తెలిపాయ్. 290 కిలోమీటర్ల ఈ రోడ్డు పూర్తైతే.. లద్దాఖ్ ప్రాంతంలోని కీలక స్థావరాలను, భద్రతా బలగాలను, ఆయుధ సంపత్తిని వేగవంతంగా తరలించొచ్చు. అదే విధంగా.. ఈ రోడ్డు కార్గిల్‌కు కీలకమైన లింక్ అందిస్తుంది. లద్దాఖ్‌కు ఇది మూడవ లింక్ రోడ్డు అవుతుంది.

హిమాచల్ ప్రదేశ్ నుంచి.. లద్దాఖ్‌కు ప్రత్యామ్నాయ రోడ్డును.. తిరిగి తెరిచే పనులు వేగవంతం అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ 2022 చివరి నాటికి పూర్తికానుంది. తూర్పు లద్దాఖ్‌లోని LAC వెంట.. దౌలత్ బేగ్ ఓల్డీతో పాటు డెప్సాంగ్ లాంటి కీలక ప్రాంతాలకు.. బలగాల తరలింపు కోసం వివిధ రోడ్డు ప్రాజెక్టులు వేగవంతం చేస్తోంది భారత్. లద్దాఖ్‌ను.. డెప్సాంగ్ మైదానాలతో కలిపే.. మరో కీలకమైన రహదారిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. ఈ రోడ్డు.. లద్దాఖ్‌లోని సబ్-సెక్టార్ నార్త్‌కు ఎంట్రీ కల్పిస్తుంది.