Stealth Submarines : ఆరు అత్యాధునిక సబ్ మెరైన్ల నిర్మాణానికి ఆమోదం

దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భార‌త్ రెడీ అయింది.

Stealth Submarines : ఆరు అత్యాధునిక సబ్ మెరైన్ల నిర్మాణానికి ఆమోదం

Stealth Submarines

Stealth Submarines దేశీయంగా అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి భార‌త్ రెడీ అయింది. భారత నౌకాదళం కోసం 6 అత్యాధునిక డీజిల్‌-ఎల‌క్ట్రిక్ సబ్ మెరైన్ల నిర్మాణం చేపట్టే మెగా ప్రాజెక్టుకు శుక్రవారం రక్షణశాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ నేతృత్వంలో రక్షణ కొనుగోళ్ల మండలి(DAC) సమావేశంలో ఈ స‌బ్‌మెరైన్ల ప్రాజెక్టుకు ఆమోదం ద‌క్కింది.

ప్రాజెక్ట్-75 ఇండియా పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ఢిఫెన్స్ షిప్ యార్డ్ మ‌జ‌గాన్ డాక్స్‌(MDL),ప్రైవేట్ షిప్ బిల్డర్.. లార్సెన్ అండ్ ట‌ర్బో(L&T) సంస్థ‌ల‌కు ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తిపాద‌న‌ల రిక్వెస్ట్(RFP) పంపనట్లు సమాచారం. ఈ రెండు కంపెనీలను ఈ ప్రాజెక్టు కోసం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మేకిన్ ఇండియా ఫ్లాట్ ఫాంలో భాగంగా 2017లో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన వ్యూహాత్మక భాగస్వామ్య(SP)పాలసీ కింద ప్రారంభించినున్న మొట్టమొదటి ప్రాజెక్టుగా P-75I నిలవనుంది. “భారత్​లో తయారీ” కింద ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.43వేల కోట్లు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా నావిక దళ సామర్థ్యంతో సరితూగే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్ క్లాస్ స‌బ్‌మెరైన్ల క‌న్నా కొత్తగా నిర్మించేవి పెద్ద సైజులో ఉండ‌నున్నాయి. ఈ సబ్ మెరైన్లలో అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధాల‌ను అమ‌ర్చ‌నున్నారు. 12 ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్స్ ఉండ‌నున్నాయి. యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైళ్ల‌ను కూడా వాడ‌నున్నారు. సుమారు 18 హెవీవెయిట్ టార్పిడోల‌ను మోసుకువెళ్లే విధంగా స‌బ్‌మెరైన్లు ఉండాల‌ని ఇప్ప‌టికే నేవీకి సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం భార‌తీయ నేవీ వ‌ద్ద 12 స‌బ్‌మెరైన్లు ఉన్నాయి. దీంతో పాటు ఐఎన్ఎస్ హ‌రిహంత్‌, ఐఎన్ఎస్ చ‌క్ర లాంటి న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరైన్లు కూడా ఉన్నాయి.