India Corona : మళ్లీ పంజా విసురుతోంది..పెరుగుతున్న కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేటు 97.45 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

India Corona : మళ్లీ పంజా విసురుతోంది..పెరుగుతున్న కరోనా కేసులు

India Corona

India Corona Cases : భారతదేశంపై మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. పలు నిబంధనలు, ఆంక్షలు సడలించాయి పలు రాష్ట్రాలు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More : Bigg Boss 5: ముమ్మర ప్రీ ప్రొడక్షన్ పనులు.. కంటెస్టెంట్లపై షూట్ కంప్లీట్!

490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేటు 97.45 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో అత్యధికంగా 23 వేల 500, మహారాష్ట్రలో 5 వేల 560, ఆంధ్రప్రదేశ్ లో 1869, తమిళనాడులో 1964, కర్నాటకలో 1826, పశ్చిమ బెంగాల్ లో 639 కేసులు నమోదయ్యాయి.

Read More :Hyderabad : ఏం ఉక్కపోత..వర్షాకాలంలో ఎండలు

మరణాల సంఖ్య 4 లక్షల 29 వేల 669కి చేరింది. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 39 వేల 069 మంది కోలుకున్నారు. మొత్తం 3 కోట్ల 12 లక్షల 60 వేల 050 మంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు.  మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 53 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 48 కోట్ల 73 లక్షల 70 వేల 196 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ICMR తెలిపింది.