India : భారత్‌‌పై కరోనా పంజా..58 వేల 097 కేసులు

గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.

India : భారత్‌‌పై కరోనా పంజా..58 వేల 097 కేసులు

Corona 11zon

India Corona : భారతదేశంలో కరోనా మరోసారి విరుచుకపడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. వైరస్ తగ్గుముఖం పడుతుందని అనుకుంటుండగా..కొత్తగా ఓమిక్రాన్ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఓ వైపు కరోనా..మరోవైపు..ఒమిక్రాన్ పంజా విసురుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనలకు గురవుతున్నారు. గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.

Read More : Omicron Kamareddy : కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు

మరోవైపు…మహారాష్ట్రలో కరోనాతో పాటు ఒమిక్రాన్‌ కల్లోలం కొనసాగుతోంది. ముఖ్యంగా రాజధాని ముంబైపై ప్రతాపం చూపుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 18వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవ్వగా.. 10వేలకు పైగా కేసులు ఒక్క ముంబైలోనే రికార్డయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 650కి పైగా ఒమిక్రాన్‌ కేసులుండగా.. ఒక్క ముంబైలోనే 4వందలకు పైగా నమోదయ్యాయి. ఆ తర్వాత పుణెలో 70కి పైగా ఒమిక్రాన్‌ కేసులున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా కేసులు సునామీలా వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ అన్నారు. థర్డ్‌వేవ్‌కు సిద్ధంగానే ఉన్నామనీ.. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఆస్పత్రులలో 30వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జంబో కొవిడ్‌ సెంటర్లు కూడా సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

Read More : Beijing : వింటర్ ఒలింపిక్స్ ఏర్పాట్లు..బబూల్‌‌లో వేలాది మంది

కరోనా కేసులు పెరుగుతుండ‌టంతో ముంబైలో స్కూళ్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రక‌టించింది. ఈ మేర‌కు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 31 వ‌ర‌కు స్కూల్స్ పూర్తిగా మూసివేయనున్నారు. ఒకటి నుంచి 9వ తరగతులకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తించనున్నాయి. ఎప్పటి లాగే పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఢిల్లీ కూడా కరోనా కేసులు పెరగడంతో వారాంతపు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ సహా ఎల్లో అలెర్ట్ ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. సినిమా హాళ్లు, జిమ్‌లను మూసివేశారు. అలాగే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో కొవిడ్‌ పేషెంట్లకు 40 శాతం బెడ్స్‌ను ఉంచాలని ఆదేశించింది ప్రభుత్వం. కేరళ కూడా జన సమూహాలపై ఆంక్షలు విధించింది. పెళ్లి, అంత్యక్రియలు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు 75 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.