COVID-19 Vaccine: ఒక బ్యాచ్‌లో 100 మందికే.. వ్యాక్సిన్‌కి 30 నిమిషాలు టైమ్ పడుతుంది!

  • Published By: vamsi ,Published On : December 8, 2020 / 11:32 AM IST
COVID-19 Vaccine: ఒక బ్యాచ్‌లో 100 మందికే.. వ్యాక్సిన్‌కి 30 నిమిషాలు టైమ్ పడుతుంది!

కరోనా వైరస్ కారణంగా దేశంలో.. ప్రపంచంలో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ప్రతిరోజూ కొత్త కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. ప్రజలలో భయాందోళన వాతావరణం నెలకొని ఉంది. అదే సమయంలో.. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. మెడిసిన్ సంస్థల నుండి అంచనాలు రావడంతో ఇప్పటికే వ్యాక్సిన్ గురించి కూడా అంచనాలు పెరిగిపోగా.. త్వరలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు.



ఈ క్రమంలోనే ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ను ఎలా తీసుకోబోతున్నారు? ప్రభుత్వం ఎలా ఇవ్వబోతుంది? అనే సమాచారం వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం వేచి చూస్తుండగా.. కరోనా వ్యాక్సిన్(కోవిడ్-19) సంక్రమణను నివారించగలదని ఆశలు ఉండగా.. దేశంలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవ్‌షీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సోమవారం రెగ్యులేటర్‌ను సంప్రదించింది. భారత్ బయోటాక్ తయారు చేస్తున్న కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు అనుమతి కోరింది.



అత్యవసర ఉపయోగం కోసం భారత్ బయోటెక్ దరఖాస్తు చేసినట్లు ప్రభుత్వ సీనియర్ వర్గాలు తెలిపాయి. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ముగ్గురు టీకా అభ్యర్థులను(ఫైజర్, సీరం మరియు భారత్ బయోటెక్) పరిశీలిస్తుంది, దీని ఆధారంగా తుది నిర్ణయం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCIG) తీసుకోబోతుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై జాతీయ నిపుణుల కమిటీ 97శాతం ప్రభుత్వ, 70 శాతం ప్రైవేట్ ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికుల డేటాను పొందినట్లు తెలిపింది. ఇందుకోసం బ్లూప్రింట్ తయారు చేసింది.



ప్రభుత్వ ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. టీకా ప్రవేశపెట్టడానికి మార్గదర్శకాలను ఖరారు చేయగా.. ప్రతి టీకా కేంద్రంలో మూడు వేర్వేరు గదులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. లబ్ధిదారుడు మొదటి గదిలో వేచి ఉండాలి. రెండవ గది ఏమిటంటే అసలు టీకాను అక్కడే వేస్తారు. తర్వాత వ్యక్తిని పరిశీలన గదికి పంపుతారు. అక్కడ ఆ వ్యక్తి 30 నిమిషాలు కూర్చుని ఉండాలి. ఈ కాలంలో ఏమైనా ప్రతికూల అంశాలు వస్తే వాటిని నమోదు చేసుకుంటారు.



ప్రతీ టీకా వేయడానికి కనీసం 30 నిమిషాలు పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రతి సెషన్‌లో 100 షాట్లు మాత్రమే ఇవ్వబడుతాయి. ప్రతి సెషన్‌లో 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. అదే సమయంలో, 30 నిమిషాల తరువాత, టీకా యొక్క ప్రతికూల సంఘటన ఏదైనా ఉంటే, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి పంపిస్తారు.