India Corona : ఇండియాకు రిలీఫ్.. తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. సెకండ్ వేవ్ లో మన దేశంలో విలయతాండవం చేసిన కరోనావైరస్ మహమ్మారి.. క్రమంగా అదుపులోకి వస్తోంది.

India Corona : ఇండియాకు రిలీఫ్.. తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

India Corona

India Corona : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. సెకండ్ వేవ్ లో మన దేశంలో విలయతాండవం చేసిన కరోనావైరస్ మహమ్మారి.. క్రమంగా అదుపులోకి వస్తోంది. కరోనా కొత్త కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. కొన్ని రోజులుగా కొత్త కేసులు 1.5 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 20లక్షల 75వేల 428 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,32,364 మందికి పాజిటివ్‌గా తేలింది. 24గంటల వ్యవధిలో మరో 2వేల 713 మంది కరోనాతో చనిపోయారు. క్రితం రోజు కంటే మరణాల సంఖ్య తక్కుగానే నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకూ 2,85,74,350 మందికి కరోనా సోకగా..3లక్షల 40వేల 702 మంది బలయ్యారు.

ఇక, యాక్టివ్ కేసుల రేటు 6.02 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 92.79 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 16,35,993 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 2,07,071 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 2.65కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. యాక్టివ్ కేసుల్లో తగ్గుదల, కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూల అంశాలు.

* కొత్తగా 1,32,364 పాజిటివ్ కేసులు నమోదు.. 2,713 మంది మృతి

* దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,85,74,350 కరోనా కేసులు నమోదు.. 3,40,702 మంది మృతి

* ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్ కేసులు.. 2,65 ,97,655 మంది డిశ్చార్జ్

* దేశంలో 6.38 శాతంగా ఉన్న పాజిటివిటి రేటు

* 11 రోజులుగా 10 శాతానికి దిగువన పాజిటివిటి రేటు నమోదు

* వరుసగా 8 రోజులుగా రెండు లక్షలకు దిగువలో కరోనా కొత్త కేసులు

* 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగ్గుతున్న కరోనా కేసులు

* ఐదు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు

* కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో అధికంగా యాక్టివ్ కేసులు

* దేశంలో భారీగా తగ్గుతున్న యాక్టివ్ కేసులు.. పెరుగుతున్న రికవరీ కేసులు

* ఒక్కరోజులో 77,420 తగ్గిన యాక్టివ్ కేసులు.. కోలుకున్న 2,07,071 లక్షల మంది

* 93.08 శాతానికి పైగా కరోనా రికవరీ రేటు.. 6.02 శాతం యాక్టివ్ కేసులు, మరణాల రేటు 1.19 శాతం