Coronavirus Update: కరోనా నుంచి తప్పించుకున్నట్లేనా? భారీగా తగ్గిన కేసులు.. ఎప్పుడు మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు?

దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8 నెలల తర్వాత, దేశంలో ఒక రోజులో 14 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదవడం ఇదే.

Coronavirus Update: కరోనా నుంచి తప్పించుకున్నట్లేనా? భారీగా తగ్గిన కేసులు.. ఎప్పుడు మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు?

Corona (3)

Coronavirus Update: దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8 నెలల తర్వాత, దేశంలో ఒక రోజులో 14 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదవడం ఇదే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఇదే సమయంలో 166మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 19,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు అంటే 6152 యాక్టివ్ కేసులు తగ్గాయి. 230 రోజుల తర్వాత తక్కువగా కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడు కోట్ల 40 లక్షల 81 వేల మందికి కోవిడ్-19 వ్యాధి సోకింది. వీరిలో 4లక్షల 52వేల 290మంది చనిపోయారు. ఇప్పటివరకు 3 కోట్ల 34 లక్షల 39 వేల మంది కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షల కన్నా తక్కువకు చేరింది. మొత్తం లక్షా 89 వేల 694 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు.

మొత్తం కరోనా కేసులు – మూడు కోట్ల 40 లక్షల 81 వేల 315
కోలుకున్నవారు – మూడు కోట్ల 34 లక్షల 39 వేల 331
యాక్టివ్ కేసులు – లక్షా 89 వేల 694
చనిపోయినవారు – 4 లక్షల 52 వేల 290
వ్యాక్సినేషన్ – 97 కోట్ల 79 లక్షల 47 వేల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు

దేశంలో కరోనా మరణాల రేటు 1.33 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.10 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.57 శాతంగా ఉండగా.. కరోనా యాక్టివ్ కేసుల విషయానికి వస్తే, భారతదేశం ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. అయితే, లేటెస్ట్‌గా వస్తున్న గణాంకాలను చూస్తుంటే మాత్రం దాదాపుగా కరోనా నుంచి దేశం తప్పించుకున్నట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మూడో వేవ్ రాకుండా ఉండాడానికి వ్యాక్సినేషన్ ఓ కారణమైతే, ప్రజలు నిబంధనలు పాటించడం మరో కారణం అని చెబుతున్నారు నిపుణులు. అయితే, మాస్క్ లేకుండా గడిపే మునుపటి జీవితం మాత్రం ఇప్పట్లో కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సమయంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉంటే, ఈ ఏడాది చివరినాటికి మాస్క్‌లు లేకుండే తిరిగే అవకాశం రావచ్చునని నిపుణులు చెబుతున్నారు.