అమెరికాను దాటేశాం.. కరోనా సెకండ్ వేవ్‌లో భారత్‌లోనే ఎక్కువగా కేసులు

అమెరికాను దాటేశాం.. కరోనా సెకండ్ వేవ్‌లో భారత్‌లోనే ఎక్కువగా కేసులు

India Corona Cases

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ గడగడలాడిస్తోంది. భారతదేశంలో వారం రోజులుగా రోజుకు సగటున 68,969 కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. అమెరికాలో సగటున 65,753 నమోదు చేయగా, బ్రెజిల్ వారం వ్యవధిలో రోజుకు 72,151 కొత్త కేసులను నమోదు చేసింది.

ఈ ప్రకారంగా చూస్తుంటే.. కరోనా కేసుల విషయంలో భారత్ అమెరికాను దాటేసింది. భారత్.. కోవిడ్ -19 కేసుల్లో ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉంది. సగటున, యునైటెడ్ స్టేట్స్‌లో కొత్త కరోనా కేసుల సంఖ్యను అధిగమించగా.. వారాంతంలో బ్రెజిల్‌ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత చెత్త వ్యాప్తి చెందుతున్న దేశంగా అవతరించింది.

ఆరు నెలల క్రితం సెప్టెంబర్ వరకు ఎన్ని కేసులు దేశంలో వచ్చేవో..? అన్ని కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా.. మరోవైపు కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయిలో కరోనా కేసులు లేటెస్ట్‌గా నమోదవగా.. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికాను భారత్‌ దాటేసి.. రెండవ స్థానానికి భారత్‌ ఎగబాకింది.

బ్రెజిల్‌లో, కరోనా వ్యాప్తి విపరీతంగా చెందుతుండగా.. సగటున 0.92% పడిపోవటం కనిపిస్తుంది. యుఎస్‌లో, కేసులు కొత్తగా పెరుగుతున్నాయి, అయితే విస్తరణ – 0.87% భారతదేశం రేటు 4.24% కంటే చాలా నెమ్మదిగా ఉంది. శుక్రవారం, భారతదేశం 89,030 కేసులు రాగా.. కరోనా మొదటి వేవ్ కంటే ఈ సమయంలో ఎక్కువ కేసులు ఉండబోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.