India Covid-19 : సూది అవసరం లేకుండానే చిన్నారులకు కరోనా టీకా

జైకోవ్‌- డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. గత ఆగస్టు 20వ తేదీనే ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

India Covid-19 : సూది అవసరం లేకుండానే చిన్నారులకు కరోనా టీకా

India Covid

Covid-19 Vaccine For Kids : దేశంలోని చిన్నారులకు టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం… ఏడు రాష్ట్రాల్లో టీకా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకోవ్‌-డీ టీకాను ఫస్ట్‌ ఏడు రాష్ట్రాల్లో అందించనుంది. బీహార్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని చిన్నారులకు ఈ టీకాను వేయనున్నారు. సూది అవసరం కూడా లేకుండానే ఈ టీకా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా పూర్తి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Read More : AP CM Jagan : నేను ఉన్నా..రెండో రోజు వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

జైకోవ్‌- డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. గత ఆగస్టు 20వ తేదీనే ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జైడస్‌ క్యాడిలా రూపొందించిన ఈ టీకా ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ ఆధారిత కోవిడ్‌ టీకాగా నిలిచింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా అందించేందుకు కోటి డోసుల కోసం కేంద్రం ఇప్పటికే ఆర్డర్‌ చేసింది. ప్రతి డోసుకు 265 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. సూది అవసరం లేకుండా చిన్నారులకు ఈ టీకాను ఇవ్వనున్నారు.  ఇందుకోసం ప్రత్యేకంగా జెట్‌ అప్లికేటర్‌ అనే పరికరాన్ని వినియోగించనున్నారు. ఆ పరికరానికి మరో 93 రూపాయలు అదనంగా ఖర్చు కానుంది. దీంతో ఒక డోసు కోసం కేంద్రం 358 రూపాయలు ఖర్చు చేస్తోంది.

Read More : Electricity Charges : తెలంగాణలో త్వరలో కరెంటు చార్జీల పెంపు ?

మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 125 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను అందజేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాటిలో 79.13 కోట్ల మంది అర్హులకు తొలిడోసు అందించగా… 45.8 కోట్ల మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ అందించామని తెలిపింది. ఇంటింటికి టీకా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వ్యాక్సిన్‌ పంపిణీలో మరింత వేగం పెరిగినట్టు తెలిపింది.  అయితే బిహార్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో చాలా మంది ఇంకా తొలిడోసే తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సూది అవసరం లేకుండా ఇచ్చే జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌ను ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తొలుత పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.