India Covid Deaths: మరి కొద్ది వారాల్లో ఇండియాలో రెట్టింపు కొవిడ్ మృతులు

ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారిన కరోనావైరస్.. మరికొద్ది వారాల్లో ఇంకా దారుణంగా మారనుందట...

India Covid Deaths: మరి కొద్ది వారాల్లో ఇండియాలో రెట్టింపు కొవిడ్ మృతులు

Covid Double Mutant

India Covid Deaths: ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారిన కరోనావైరస్.. మరికొద్ది వారాల్లో ఇంకా దారుణంగా మారనుందట. ప్రస్తుతమున్న లెవల్స్ కంటే రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు రీసెర్చర్లు అంటున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జూన్ 11నాటికి సంభవించిన 4లక్షల 4వేల కొవిడ్ మరణాలు జరుగుతాయని చెప్పింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ జులై నాటికి పది లక్షల 18వేల 879 మృతులు గురికావొచ్చని చెప్పింది.

కరోనావైరస్ కేసులను అంచనా వేయడం కష్టం. ప్రత్యేకించి ఇండియా లాంటి దేశాలు పబ్లిక్ ఆరోగ్య సూచనలు, టెస్టింగులు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిన అత్యవసరం ఉంది. వీటిని నిర్లక్ష్యపరిస్తే.. ప్రపంచంలోనే అతి ఎక్కువ కొవిడ్ మరణాలను చవిచూడాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో సంభవించిన 5లక్షల 78వేల కొవిడ్ మరణాలే ప్రపంచంలో అత్యధికం.

ఇండియాలో మంగళవారానికి 3లక్షల 57వేల 229కేసులు నమోదైనట్లు చెప్పారు. మొత్తం 20మిలియన్ మందికి ఇన్ఫెక్షన్లు రాగా 2లక్షల 22వేల 408మంది మృత్యువాతకు గురయ్యారు. ఇది రాబోయే వారాల్లో మరింత ఎక్కువగా ఉండనుంది. స్మశాన వాటికలు, హాస్పిటల్స్, అంబులెన్స్ లు అన్ని విషయాల్లో కొరత కనిపిస్తూనే ఉంది.

మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో ఇండియా మరి మరీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోనుందని డీన్ ఆఫ్ బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ అన్నారు. ఈ ప్రభావం వారాల గ్యాప్ లోనే చూడాల్సి వస్తుంది.