India Covid End : త్వరలోనే కరోనా ఖతం, థర్డ్ వేవ్ రిస్క్ లేనట్టే.. భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్ లో మరికొద్ది వారాల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా? వచ్చే జూలై నాటికి దేశంలో కరోనా ఖేల్ ఖతం అవుతుందా? కరోనా థర్డ్ వేవ్ రిస్క్ కూడా ఇండియాకు లేనట్టేనా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. శాస్త్రవేత్తలు చేస్తున్న అధ్యయనాలు చూస్తే, కరోనాకు మరికొద్ది నెలల్లో ఎండ్ కార్డు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

India Covid End : త్వరలోనే కరోనా ఖతం, థర్డ్ వేవ్ రిస్క్ లేనట్టే.. భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

India Covid End

Covid End : కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్ లో మరికొద్ది వారాల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా? వచ్చే జూలై నాటికి దేశంలో కరోనా ఖేల్ ఖతం అవుతుందా? కరోనా థర్డ్ వేవ్ రిస్క్ కూడా ఇండియాకు లేనట్టేనా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. శాస్త్రవేత్తలు చేస్తున్న అధ్యయనాలు చూస్తే, కరోనాకు మరికొద్ది నెలల్లో ఎండ్ కార్డు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక కరోనా సెకండ్ వేవ్ ధాటికి భారత్ అల్లకల్లోలంగా మారింది. ఈ నెలలోనే ప్రపంచం ఎన్నడూ చూడని విపత్తుని భారత్ చూసింది. రోజుకు 4లక్షలకు పైగా కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. నిత్యం 4వేల మందికిపైగా కరోనా కాటుకు బలవుతున్నారు. కాగా, కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరణాల స్పీడ్ మాత్రం ఆగడం లేదు. ప్రపంచంలో మరే దేశంలోనూ నమోదు కాని మరణాలు ఇండియాలోనే రికార్డ్ అవుతున్నాయి. అయితే, ఇదంతా మరికొన్ని రోజులు మాత్రమేనని సైంటిస్టులు చేస్తున్న అధ్యయనాలు చెబుతున్నాయి.

మ్యాథమేటికల్ డేటా మోడలింగ్ ఆధారంగా సైంటిస్టులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు రోజుకు సగటున నమోదవుతున్న 3లక్షల కేసులు మరో కొన్నిరోజుల్లోనే లక్షకు చేరతాయని అంటున్నారు. జూన్ 2 నాటికి రోజుకు లక్ష కంటే తక్కువ తక్కువగా కేసులు రికార్డ్ అవుతాయని తెలిపారు. జూన్ నెల అంతా కూడా కేసులు తగ్గడమే కానీ పెరగడం అనేది ఉండదని స్పష్టం చేశారు. ఇలా కేసులు తగ్గుతూ తగ్గుతూ జూలై నాటికి అత్యంత తక్కువగా కేసులు నమోదవుతాయని తెలిపారు. జూలై 7 నాటికి రోజుకు 10వేల కంటే తక్కువ కేసులు రికార్డ్ అవుతాయని ఓ అంచనాకు వచ్చారు. ఇన్ ఫెక్షన్ రేటు డేటా ఆధారంగా, మేథమేటికల్ మోడలింగ్ ద్వారా ఈ అంచనా వేశారు. వీటిలో ఎక్కువగా పీరియాడికల్స్ మోడల్సే ఉంటాయి. అయినప్పటికి ప్రస్తుత కరోనా వ్యాప్తిని తగ్గుతున్న వేవ్ గ్రాఫ్ ని పరిశీలించి ఈ విధంగా సైంటిస్టులు డేటాను విడుదల చేశారు.

ఇక కరోనా థర్డ్ వేవ్ పైనా శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పుడున్న డేటా ఆధారంగా అయితే, భారత్ కు థర్డ్ వేవ్ రిస్క్ లేనట్టేనని తేల్చి చెప్పారు. అయితే, అది ప్రజల మీద పూర్తిగా ఆధారపడిన విషయం అని స్పష్టం చేస్తున్నారు. గత జనవరి నాటి పరిస్థితులు మళ్లీ జూలైలో వస్తాయని, కేసులు తగ్గుతాయని తెలిపారు. అయితే ఫస్ట్ వేవ్ తర్వాత ప్రదర్శించిన అలసత్వాన్ని ప్రజలు మళ్లీ రిపీట్ చేస్తే, సెకండ్ వేవ్ వచ్చినట్లే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.