India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు

రెండు రోజుల వరకు నిఘా మిషన్‌లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్‌లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్‌కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్‌పై నిఘా ఉంచడానికి అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉంది

India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు

India deploys more drones in Ladakh as Chinese troops clash with Indian Army in Tawang

India-China Border Clash At LAC : వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా కార్యకలాపాలపై చెక్ పెట్టేందుకు భారత్ తన నిఘా సామర్థ్యాలను పెంచింది. తూర్పు లడఖ్ సెక్టార్‌తో పాటు సిక్కిం (కీలకమైన చికెన్ నెక్) కారిడార్‌కు దగ్గరగా కొత్త డ్రోన్ యూనిట్లను మోహరించింది. ఈ కొత్త డ్రోన్‌లు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటాయి. దీర్ఘకాల మిషన్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సరిహద్దు ప్రాంతాల్లో చైనా సైనిక కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకు ఈ డ్రోన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని దేశ రక్షణ శాఖ పేర్కొంది. “రెండు రోజుల వరకు నిఘా మిషన్‌లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్‌లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్‌కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్‌పై నిఘా ఉంచడానికి అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉంది ”అని రక్షణ వర్గాలు తెలిపాయి.

Ayodhya Mosque: అయోధ్య మసీదు నిర్మాణానికి తొలగిన అతిపెద్ద అడ్డంకి.. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం తొందరలో ప్రారంభం

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబ‌ర్ 9 (2022)జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాల‌తో భార‌త్ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నిఘా ముమ్మరం చేసింది. డ్రాగన్ ఉల్లంఘ‌న‌ల‌ను అడ్డుకునేందుకు గ‌త కొన్ని రోజుల నుంచి భార‌త వైమానిక ద‌ళాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అరుణాచ‌ల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వ‌ద్ద జోరుగా పెట్రోలింగ్ జ‌రుగుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

New Zealand: 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగొద్దు, వారికి సిగరెట్ అమ్మొద్దు.. సంచలన చట్టం చేసిన ప్రభుత్వం

డిసెంబ‌ర్ 9వ తేదీన త‌వాంగ్ సెక్టార్ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు ఎల్ఏసీ దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చినందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించారు. చైనా సైనికులను భారత్ సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని వెల్లడించారు. ఘ‌ర్ష‌ణ రోజున ఇరు వ‌ర్గాల ద‌ళాల‌కు స్వ‌ల్ప స్థాయిలో గాయాలైన‌ట్లు తెలుస్తోంది. కానీ మంత్రి మాత్రం భారత సైనికులకు ఎటువంటి గాయాలు అవ్వలేదని తెలిపారు. కాగా..అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం ఆయన ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రకటించారు.