వుహాన్ నుంచి వైరస్.. ఏడాది క్రితం ఇండియాకు వచ్చిన కుర్రాడే దేశంలో కరోనా వ్యాప్తికి మూలమయ్యాడు!

10TV Telugu News

India end of one year covid tunnel  from Wuhan : ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి ఇండియాకు వచ్చి సరిగ్గా నేటికి (జనవరి 30) ఏడాది అవుతుంది. గత ఏడాది జనవరి 30,2020లో వుహాన్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తి ద్వారా తొలి కేసు నమోదైంది. అప్పటినుంచి కరోనా మహమ్మారి 20 దేశాలకు వేగంగా వ్యాపించగా.. ఇప్పటికే 170మందికి పైగా వైరస్ బారినపడి మృతిచెందారు. చైనాలోని వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న త్రిసూర్ కు చెందిన 20ఏళ్ల విద్యార్థి ఇదే రోజున తిరిగి ఇంటికి వచ్చాడు.

భారతదేశంలో ఫస్ట్ కరోనావైరస్ టెస్టు పాజిటివ్ వచ్చింది ఇతడికే.. ఆ తర్వాతి నాలుగు రోజుల్లో కేరళలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయయ్యాయి. వీరూ కూడా చైనాలో చదువుతున్నవారే.. గత ఏడాది జనవరి ఆఖరిలో కొత్త కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ పోయినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే నమోదైంది. అంతకుముందు SARS, Zika, Nipah వైరస్ లు కూడా విజృంభించాయి.

అయినా ఈ వైరస్ ల బారినుంచి భారత్ బయటపడింది. కానీ, కరోనా నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇండియాలో జనవరి 30,2020లో ఫస్ట్ కేసు 20ఏళ్ల విద్యార్థికి నమోదు కాగా.. మార్చి 2న కేరళ బయట రాష్ట్రాల్లో ఢిల్లీ, హైదరాబాద్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 12న ఫస్ట్ కరోనా మరణం నమోదైంది. కర్నాటకలోని కలబర్గీకి చెందిన 76ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతిచెందాడు.

ఆ తర్వాత సెప్టెంబర్ 16న భారతదేశంలో కరోనా కేసులు ఒక్క రోజులో గరిష్టంగా 97,894 వరకు నమోదయ్యాయి. సెప్టెంబర్ 15న ఒక్క రోజులో 1,290 కరోనా మరణాలు నమోదయ్యాయి. మార్చి 24న లాక్ డౌన్ విధించగా.. సెప్టెంబర్ 17న దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 10.17 లక్షలకు చేరాయి. జనవరి 16, 2021న భారతదేశం వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.