India’s export of liquid oxygen: కరోనా వేళ..9,234మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు అమ్మిన భారత్

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలోదేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది.

India’s export of liquid oxygen:   కరోనా వేళ..9,234మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు అమ్మిన భారత్

India’s Export Of Liquid Oxygen

India ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలోదేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది. చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత వేధిస్తోందంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక చనిపోతున్న వార్తలు వింటూనే ఉన్నాం. దీంతో అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచేలా రెండ్రోజుల క్రితమే కేంద్రం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించింది.

అయితే, దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కూడా పరిశ్రమలు ఆక్సిజన్‌ను ఎగుమతి చేసి అమ్ముకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో మన దేశం నుంచి విదేశాలకు భారీగా ఆక్సిజన్ ఎగుమతి అయింది. 2020-21 ఆర్థికసంవత్సరం(ఏప్రిల్ నుంచి జనవరి) మొదటి మూడు క్వార్టర్లోనే భారత్..9,294 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఎగుమతుల లెక్కలను ఇంకా ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. ఎగుమతి అయింది లిక్విడ్ ఆక్సిజన్ కావడంతో పారిశ్రామికంగానే గాక వైద్య రంగంలోనూ వాడుకుంటారు.

కాగా, గత ఏడాది మొత్తంగా 4,500 టన్నుల ఆక్సిజన్ ను ఎగుమతి చేసిన .. ఒక్క జనవరిలోనే మరో 4,500 టన్నులకు పైగా ఎగుమతి చేసినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో ప్రభుత్వం కేవలం 352 టన్నులే ఎగుమతి చేయగా.. ఈ ఏడాది జనవరిలో దానికి 734 శాతం అధికంగా ఆక్సిజన్ ను విదేశాలకు సరఫరా చేసింది. 2019 డిసెంబర్ లో 538 టన్నులను సరఫరా చేసిన భారత్.. గత ఏడాది డిసెంబర్ లో మాత్రం 308 శాతం అధికంగా 2,193 టన్నులను ఎగుమతి చేసింది. ఇక, భారత్ నుంచి ఎక్కువగా ఆక్సిన్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మొదటిస్థానంలో బంగ్లాదేశ్,తర్వాతి జాబితాలో నేపాల్, భూటాన్ ఉన్నాయి. ప్రపంచంలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్న పెద్ద దేశాలలో ఒకటిగా ఉన్న భారత్ లో ప్రస్తుతం ప్రాణ వాయువు కొరతను ఎదుర్కోవడం ఆందోళనకు గురి చేస్తుంది.