అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ పొడిగించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : June 26, 2020 / 02:47 PM IST
అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ పొడిగించిన భారత్

కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్  ఇంటర్నేషనల్  కమర్షియల్ ఫ్లైట్  సర్వీసులపై బ్యాన్ ను జూలై 15 వరకు పొడిగించబడింది. ఇంతకుముందు వరకు  ఇంటర్నేషనల్  కమర్షియల్ ఫ్లైట్  సర్వీసులపై  జూన్-30వరకు బ్యాన్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాన్ ను జులై-15వరకు పొడిగించింది. 

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 25 న దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిత్ . మే 25 న పరిమిత స్థాయిలో  దేశీయ విమాన  కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ,  అంతర్జాతీయ విమానాలను ఇప్పటికీ అనుమతించలేదు.

శుక్రవారం(జూన్-26,2020) ఒక సర్క్యులర్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్( డీజీసీఏ)… అంతర్జాతీయ కార్గో విమానాలు మరియు ముఖ్యంగా డిజిసిఎ ఆమోదించిన విమానాలకు తాజా పరిమితి వర్తించదని తెలిపింది. అదే సమయంలో పరిస్థితిని బట్టి కొన్ని అంతర్జాతీయ సర్వీసులను నడిపే అవకాశం కూడా ఉందని తెలిపింది.