అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2020 / 01:49 PM IST
అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించిన భారత్

కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానసర్వీసులపై బ్యాన్ ను పొడిగిస్తున్నట్లు ఇవాళ(మార్చి-26,2020)సివిల్ ఏవియేషన్ డైరక్టర్ జనరల్ తెలిపారు.

ఏప్రిల్-14వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఆమోదిత అన్ని కార్గొ ఆపరేషన్స్ అండ్ ఫ్టైట్స్ కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే కార్గో ఫైట్ లకు మాత్రం మినహాయింపు ఉంది. దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.