ICMR-కోవ్యాక్సిన్: ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’ వస్తుందా? ప్రజల ఆశలు ఫలించేనా?

  • Published By: nagamani ,Published On : July 8, 2020 / 01:01 PM IST
ICMR-కోవ్యాక్సిన్: ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’ వస్తుందా? ప్రజల ఆశలు ఫలించేనా?

ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో కూడా కరోనా విలయం సృష్టిస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎంతగానో యత్నిస్తున్నా..ఫలితం మాత్రం కనిపించట్లేదు. పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టటంలో బిజీ బిజీగా ఉన్నాయి. పలువురు సైంటిస్టులు ఈ కరోనాకు చెక్ పెట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి కరోనాకు వ్యాక్సిన్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి.

ప్రపంచ దేశాలన్నీ కరోనాకు వ్యాక్సిన్ తీసుకొస్తున్నాయి..ఇక కరోనాను కట్టడి చేయవచ్చు అనే ఆశలు ప్రజల్లో నెలకొన్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ వస్తే కరోనాను పూర్తిగానివారించవచ్చా?కరోనా వ్యాక్సిన్లు అనే వ్యాక్సిన్లు అన్నీ కరోనాను నియంత్రిస్తాయా? ఇవి ఎంత వరకూ పనిచేస్తాయి? అనే అంశాలపై భారత్ లోనే కాక ప్రపంచ దేశాల్లోచర్చలు విస్తృతంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో భారతీయ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భారత్ బయోటెక్‌ (Bharat Biotech) సంస్థ సంయుక్తంగా తయారుచేసే కొత్త కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ..ఆగస్టు 15కల్లా కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తుందనే వార్తలు వస్తున్నాయి. కానీ పర్టిక్యులర్ గా ఆగస్టు 15నాటికి ఈ వ్యాక్సిన్ వస్తుందనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వలేకపోతోంది. కారణం ఏమిటంటే..ఓ తేదీని ప్రకటించాం కదాని తొందరపడి దాన్ని వినియోగిస్తే..దుష్పరిణామాలు తలెత్తే అవాకాశాలుఉన్నాయి.దీంతో ICMR ప్రకటన తేదీకి అంటే ఆగస్టు 15నాటికి వ్యాక్సిన్ వస్తుందని చెప్పలేం అని మ్యాక్స్ క్యూర్ చీఫ్ డాక్టర్ ముఖర్జీతెలిపారు.

దీనిపై డాక్టర్ ముఖర్జీ మాట్లాడుతూ..ఏ వ్యాక్సిన్ అయినా తొందరపడి ఉపయోగించకూడదనీ..దీని వల్ల పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేమని గతంలో కూడా పలు వ్యాక్సిన్ ల పరిస్థితి ఇలాగే అయ్యిందని తెలిపారు. ఏ వైరస్ కైనా వ్యాక్సిన్ వచ్చిందీ అంటే అది ఒకసారి నోట్లో వేసేస్తే ఆ వైరస్ ఇక ఎప్పుడూ రాదని గ్యారంటీ లేదని ఉదాహరణకు పోలీయో వంటివి అటువంటివేనని అన్నారు. పోలియోకు ఇప్పటికీ విడతల వారీగానూ..ప్రతీ సంవత్సరం కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలకు వేస్తున్నామని అటువంటివాటిని డైనమేట్ వ్యాక్సిన్ లు అంటారని..ఈ కరోనా వ్యాక్సిన్ కూడా అదృష్టవశాత్తు వచ్చి..అది మంచి ఫలితాలను ఇస్తే ఆ వ్యాక్సిన్ వేసుకుంటూ ఇక ఎప్పటికీ కరోనా వైరస్ రాదు అని గ్యారంటీగా చెప్పలేమని డాక్టర్ ముఖర్జీ అన్నారు. ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా పూర్తిస్థాయిగా వైరస్ ను నియంత్రిస్తుందని మనం అంచనాలు పెట్టుకోకూడదని తెలిపారు.

ఉదాహరణకు స్వైన్ ఫ్లూ వచ్చినవారికి దానికి సంబంధించి వచ్చిన వ్యాక్సిన్ వేసినా నూటికి నూరు శాతం ప్రొటక్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉందనీ..ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చినా..అదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా డాక్టర్ ముఖర్జీ ఎన్నో విషయాలను తెలిపారు.

వ్యాక్సిన్ ట్రయల్స్ వేగవంతం..
అయితే, ఈ టీకా పరీక్షల్లో నిమగ్నమైన వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మానవులపై పరీక్షలు ప్రారంభం కావడానికి కనీసం ఒక వారం సమయం పట్టవచ్చని తెలుస్తోంది. సాధారణంగా ట్రయల్ పూర్తి కావడానికి 6 నెలల సమయం పడుతుంది. పరీక్షలు పూర్తిచేసి టీకాను ఆగస్టు 15నాటికి విడుదల చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. అయితే టీకా మార్కెట్లోకి రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టనుంది.

కరోనా టీకా తయారీలో ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రారంభదశలో విజయాన్ని సాధించాయి. వీటిలో భారతదేశం కూడా ఒకటి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌ కంపెనీ కోవాక్సిన్ పరీక్షలు తుది దశకు చేరుకోవడంతో అన్నీ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. అయితే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ టీకా తయారీలో ముఖ్యమైన పాత్ర పోషించి విజయవంతం దిశగా తీసుకెళ్లాయని భారత్ బయోటెక్ ప్రకటించింది.

ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందని అది మన భారత్ లోనే తయారు కాబోతోంది. ఇక మనకు ఎటువంటి భయం ఉండని ప్రజలు పూర్తిస్థాయిలో భరోసా పెట్టుకోకపోవటమే మంచిది. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ తొలిసారి వస్తున్న క్రమంలో దాని ఫలితాలు..పరిణామాలు..వంటివి చాలా కీలకం. ఈక్రమంలో కరోనా వ్యాక్సిన్ ఆగస్టు 15నాటికి వస్తుందా? వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అనే అంశంపై దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి.

Read Here>>7 రోజుల్లో ల‌క్షా 60వేల కేసులు, 3వేల 242 మ‌ర‌ణాలు..