Covid-19 India : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..60వేలకు దిగివచ్చాయి

కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన భారత్ గత కొన్ని రోజులుగా ఊపిరి తీసుకుంటోంది. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. సెకండ్ వేవ్ లో ఎన్నో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయిన క్రమంలో తగ్గుతున్న కరోనా కేసులు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

Covid-19 India : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..60వేలకు దిగివచ్చాయి

India Corona Cases

india covid cases : కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన భారత్ గత కొన్ని రోజులుగా ఊపిరి తీసుకుంటోంది. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. సెకండ్ వేవ్ లో ఎన్నో ప్రాణాలు పిట్టల్లా రాలిపోయిన క్రమంలో తగ్గుతున్న కరోనా కేసులు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈక్రమంలో గత 24 గంటల్లో కొత్తగా 60,471 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ..ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,13,378 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకూ 3,77,031మంది మృతి చెందారు.

రోజువారీ కరోనా కేసులు 75 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్రం వెల్లడించింది. మరో వైపు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని..అలాగే వైరస్‌ బారినపడి మరో 2,726 మంది మరణించారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకోవటం సంతోషించాల్సిన విషయం.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,77,031 మంది వైరస్ సోకి మృతి చెందగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 9,13,378 ఉన్నాయని తెలిపింది. రోజు రోజుకు దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో 25,90,44,072 డోసులు వేసినట్లు తెలిపింది. ప్రసుతం దేశంలో రికవరీ రేటు 95.64శాతానికి పెరిగిందని..వారంలో పాజిటివిటీ రేటు 5 శాతానికన్నా తక్కువకు పడిపోయిందని.. 4.39శాతంగా ఉందని కేంద్రం మంత్రిత్వశాఖ వెల్లడించింది. వరుసగా ఎనిమిదవ రోజు 5శాతానికన్నా తక్కువగా ఉందని కేంద్ర కుటుంబ..ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.