Unemployed : బిగ్ ప్రాబ్లమ్.. భారత్‌లో 5.3 కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. నష్టాలు రావడంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది.

Unemployed : కరోనావైరస్ మహమ్మారి ఏ క్షణాన వెలుగులోకి వచ్చిందో కానీ.. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఈ మహమ్మారి అనేకమంది ప్రాణాలు బలి తీసుకుంది. కొత్త రూపాల్లో విరుచుకుపడుతూనే ఉంది. కోవిడ్ దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. ప్రాణ నష్టమే కాదు ఆర్థికంగా తీవ్రమైన ప్రభావం చూపిందీ మహమ్మారి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది కరోనా. ఫలితంగా ఆయా దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి.
Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?
ఇతర దేశాల సంగతి అటుంచితే.. భారత్ పైనా కరోనా మహమ్మారి తీవ్రమైన ప్రభావమే చూపింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. నష్టాలు రావడంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది. 2021 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో మహిళా నిరుద్యోగుల సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపిన ఈ లెక్కలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
5.3 కోట్ల మందిలో 3.5కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తుండగా.. 1.7కోట్ల మంది మాత్రం జాబ్ చేయాలని ఉన్నా అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని సీఎంఐఈ తన నివేదికలో తెలిపిది. ఇక ఉద్యోగ వేటలో ఉన్న వారిలో 23శాతం మంది (80లక్షల మంది) మహిళలు అని తెలిపింది. జాబ్ చేయాలని ఉన్నా.. అందుకు సరైన ప్రయత్నాలు చేయకుండా ఉన్నవారిలో 53శాతం మంది (90 లక్షల మంది) మహిళలే అని వెల్లడించింది.
Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు
ఉద్యోగ వేటలో అంత యాక్టివ్‌గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారని, అందుకు ప్రధాన కారణం అవకాశాలు లేకపోవడమే అని సీఎంఐఈ తెలిపింది. ఇక చాలా చోట్ల మహిళలంటే కంపెనీలు వెనక్కి తగ్గుతున్నాయంది. ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు సామాజికంగానూ ఎలాంటి సహకారం అందడం లేదని తన నివేదికలో తెలిపింది సీఎంఐఈ. కాగా, “నిరుద్యోగ రేటులో 7.9శాతం మందికి లేదా 35 మిలియన్ల మందికి భారత్ తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలని” CMIE తన విశ్లేషణలో పేర్కొంది. దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం.. భారత్ లాంటి దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితే. దీన్ని చక్కదిద్దేలా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎంఐఈ సూచించింది.
- Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక
- Covid-19 : దేశంలో కొత్తగా 2,226 కోవిడ్ కేసులు నమోదు
- Covid Variant: భారత్ లో నమోదైన రెండో BA.4 ఒమిక్రాన్ కేసు
- FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే
- Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
1NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
2Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ ప్రయాణీకులు డ్యాన్స్
3Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ
4GVL Comments: బుల్డోజర్స్ ఎత్తితేనే ఏపీలో అవినీతి నిర్మూలన: జీవీఎల్
5Amazon Discount: అమెజాన్ ఆఫర్ల వర్షం.. సెలక్టెడ్ మొబైల్స్‌పై 51% డిస్కౌంట్
6PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..
7Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
8Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
9Delhi : పెంపుడు కుక్కతో వాకింగ్ కు వస్తున్న ఐఏఎస్ అధికారి..క్రీడాకారులను అడ్డుకుంటున్న స్టేడియం సిబ్బంది..
10Chandrababu Naidu: “అప్పటి ప్రధాని వాజ్‌పేయి రావడం మరిచిపోలేని సంఘటన”
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్