షట్ డౌన్ పొడిగించినా కూడా….ఉన్న నిల్వలతో ఏడాదిన్నర పాటు పేదలకు ఆహారం అందిచవచ్చు

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2020 / 10:32 AM IST
షట్ డౌన్ పొడిగించినా కూడా….ఉన్న నిల్వలతో ఏడాదిన్నర పాటు పేదలకు ఆహారం అందిచవచ్చు

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతర్జాతీయ విమానసర్వీసులు,దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దు అయిపోయాయి. అయితే గూడ్స్ రైళ్లు మాత్రం,నిత్యావసర సరుకులను క్యారీ చేసే వాహనాలు మాత్రం రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

అయితే ఈ షట్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించబడితే…దేశంలోని పేదల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలను పలువురు లేవనెత్తుతున్నారు. అయితే మన దేశంలో ప్రస్తుతమున్న ధాన్యం నిల్వలతో..ఏడాదిన్నర పాటు పేదల కడుపు నింపవచ్చు అంట. మన దగ్గర ఆహార ధాన్యాల నిల్వలు ఏడాదిన్నరకు సరిపడా ఉన్నాయని,దేశంలో ఆహార కొరత ఉండే సమస్యే లేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డీవీ ప్రసాద్ తెలిపారు.

వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద ఏటా పేదలకు అందించేందుకు అవసరమయ్యే 5-6కోట్లతో పోలిస్తే…ఏప్రిల్ చివరి నాటికి దేశవ్యాప్తంగా గిడ్డంగులలో 10కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉంటాయని ప్రసాద్ తెలిపారు. చాలా నెలల వరకు తమ అవసరాలకు సరిపడే నిల్వలను ఉంచుకునే సామర్థ్యం చాలా రాష్ట్రాల్లోని ఫెయిర్ ప్రైస్ షాప్ లకు లేదని ఆయన తెలిపారు. గత వారం ఆహారశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ…పౌర సరఫరా వ్యవ్యస్థ(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)లబ్ధిదారులు వెంటనే తమ ఆరు నెలల సబ్సీడీ ధాన్యాల కోటాను కొనుక్కోవచ్చని తెలిపారు.

అయితే మనదేశంలో మాదిరిగా కొన్ని దేశాల్లో పరిస్థితులు లేవు. చాలా దేశాల్లో ఫుడ్ కి డిమాండ్ పెరిగిపోతున్నప్పటికీ వాళ్ల దగ్గర సరిపడా ఆహార ధాన్యాలు లేవు. ఆయా దేశాల్లోని ప్రజలు అత్యవసర వస్తువులను నిల్వలు చేసుకుంటుండటంతో అక్కడ ధరలు కూడా పెరిగిపోయాయి,అంతేకాకుండా అక్కడ ఆహార పదార్ధాల కొరత కూడా ఏర్పడింది. ఈ సమయంలో మన దగ్గర మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అయితే భారతదేశంలో వినియోగదారులు అవసరమైన వస్తువులను నిల్వ చేయడానికి పరుగెత్తుతారనే ఆందోళనలు,మరియు ఈ సమయంలో ధరలు విపరీతంగా పెరిగే అవకాశముందన్న ఆందోళనలు అందరిలో నెలకొన్నాయి. 

See Also | వీడియో కాన్ఫిరెన్స్‌లో మంత్రి నిర్మల మీడియా కాన్ఫిరెన్స్ : కరోనా సంక్షోభంపై ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం రెడీ!

రాష్ట్రాలన్నీ ఆరు నెలల వరకు తమ అవసరాలను తీర్చగలిగేందుకు కేంద్రప్రభుత్వం నుంచి 3కోట్ల టన్నుల గోధుమ,రైస్ ను కొనాల్సిన అవసరముందని ప్రసాద్ తెలిపారు.త్త గోధుమ పంట ఏప్రిల్ చివరినాటికి వస్తుందని,దీంతో ప్రస్తుతమున్న 6కోట్ల 40లక్షల టన్నుల కంటే కేంద్రప్రభుత్వం దగ్గర నిల్వలు పెరుగుతాయని ప్రసాద్ తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ నుంచి అప్పు కింద రాష్ట్ర ప్రభుత్వాలు 3నెలలకు ఆహార ధాన్యాలను తీసుకోవచ్చని సోమవారం భారత ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే. దీని ద్వారా అవసరమైనవారికి ఆహారం అందించడంలో ఎటువంటి ఆర్థిక అవరోధాలు ఎదుర్కోకుండా ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు భరోసా ఇస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు

Also Read | రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని నిజామాబాద్ నేతలు