Street Dogs : దేశంలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయో తెలుసా!

  దేశవ్యాప్తంగా వీధుల్లో లేదా షెలర్ట్ హోమ్స్ లో నివసిస్తున్న కుక్కలు మరియు పిల్లుల సంఖ్య దాదాపు 8 కోట్లుగా తేలింది. మార్స్ పెట్‌కేర్ ఇండియా గురువారం విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం

10TV Telugu News

Pet Homelessness Index  దేశవ్యాప్తంగా వీధుల్లో లేదా షెలర్ట్ హోమ్స్ లో నివసిస్తున్న కుక్కలు మరియు పిల్లుల సంఖ్య దాదాపు 8 కోట్లుగా తేలింది. మార్స్ పెట్‌కేర్ ఇండియా గురువారం విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం..అమెరికా,చైనా,జర్మనీ దేశాలకన్నా మన దేశంలోనే నివాసం లేని పిల్లులు, కుక్కలు ఎక్కువగా ఉన్నాయి.

మార్స్ పెట్‌కేర్ ఇండియా ప్రముఖ జంతు సంక్షేమ నిపుణుల సలహా మండలి భాగస్వామ్యంతో ‘స్టేట్ ఆఫ్ పెట్ హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్’ పేరుతో విడుదల చేసిప నివేదిక ప్రకారం…దాదాపు 68శాతం జనాభాకు(ప్రతి 10మందిలో ఏడుగురు) వీధి పిల్లులు వారానికోసారి కనిపిస్తున్నాయి. ఇక కుక్కలను తరచూ చూస్తున్నట్టు 77శాతం జనాభా(ప్రతి 10మందిలో ఎనిమిది) పేర్కొంది. వీధి కుక్కులు, పిల్లుల సంఖ్య పెరుగుతోంది అంటే..”ఆల్​ పెట్స్​​ వాంటెడ్​(జంతువుల పెంపకం)” డేటాలో భారత్​ స్కోరు పడిపోతోందని అర్థం. భవిష్యత్తులో జంతువులను పెంచుకోవడానికి సముఖంగా ఉన్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేశ ‘ఆల్​ పెట్స్​ కేర్డ్​ ఫర్​(జంతువుల సంరక్షణ)’ స్కోరు పెరిగింది. ఇక, వికలాంగులకు సహాయం చేయడంలో ఎలాంటి శిక్షణ లేని జంతువులు(కంపానియన్​ యానిమల్స్​) 85శాతం ఉన్నాయి.

ఇక, చైనాలో 7.5కోట్లు, అమెరికాలో 4.8కోట్లు, జర్మనీలో 20.6లక్షలు, గ్రీస్​లో 20లక్షలు, మెక్సికోలో 74లక్షలు, రష్యా- దక్షిణాఫ్రికాలో 41లక్షలు, బ్రిటన్​లో 11లక్షలు నివాసం లేని కుక్కలు,పిల్లులు ఉన్నాయి.

భారతదేశంలోని EPH ఇండెక్స్ డేటా ప్రకారం.. భారతదేశంలో 82 శాతం కుక్కలను వీధి కుక్కలుగా పరిగణిస్తారు. 53 శాతం మంది ప్రజలు..వీధి కుక్కల వల్ల ప్రజలకు ప్రమాదం ఉందని, 65 శాతం మంది ప్రజలు కుక్క కాటుకు భయపడుతున్నారని, 82 శాతం మంది వీధి కుక్కలను షెల్టర్లలో పెట్టాలని నమ్ముతున్నారు.

ALSO READ NITI Aayog’s MPI : దేశంలో పేద రాష్ట్రాలు ఇవే..బీహార్ లో సగానికి పైగా జనాభా పేదరికంలోనే

×