Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్

తజికిస్థాన్, భారత్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, కిర్గిజిస్తాన్, చైనా దేశాలకు చెందిన జాతీయ భద్రత సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొన్నారు.

Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్

Doval

Ajit Doval: ‘ఆఫ్ఘనిస్తాన్ తో ఒక ముఖ్యమైన భాగస్వామ్య దేశంగా భారత్ ఉందని, శతాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో ఉన్న ప్రత్యేక సంబంధాలు భారతదేశం యొక్క విధానానికి మార్గనిర్దేశం చేస్తాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. తజికిస్థాన్, భారత్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, కిర్గిజిస్తాన్, చైనా దేశాలకు చెందిన జాతీయ భద్రత సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొన్నారు. కజకిస్తాన్ లోని దుషాంబేలో జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ, ఎన్ఎస్ఏలు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఈ ప్రాంతంలో పరిస్థితులపై చర్చించాయి. ఆఫ్ఘనిస్తాన్ పై 2021 నవంబర్ లో న్యూఢిల్లీలో జరిగిన మూడవ ప్రాంతీయ భద్రతా చర్చలకు అనుసరణగా ఈ సమావేశం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి మరియు సుస్థిరతను నెలకొల్పి, ఉగ్రవాదం వలన కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి నిర్మాణాత్మక మార్గాలను కనుగొనాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు.

other stories:K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి

ఈసందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ అఫ్గానిస్థాన్ తో భారతదేశానికి చారిత్రక, నాగరిక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారతదేశం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని.. ఇది భారతదేశం యొక్క విధానానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ మరియు మానవతా సహాయంపై భారత్ దృష్టి సారించిందని అజిత్ దోవల్ పేర్కొన్నారు. ఆగస్టు 2021 నుండి ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను, 5,00,00,000 డోసుల కొవాగ్జిన్, 13 టన్నుల అత్యవసర మందులు, 60 మిలియన్ మోతాదుల పోలియో వ్యాక్సిన్లను భారత్ అఫ్గాన్ కి చేరవేసింది.

other stories:Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం

మహిళలు, మైనార్టీలు సహా ఆఫ్ఘన్ సమాజంలోని అన్ని వర్గాల వారికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ఎన్ఎస్ఎ పేర్కొంది. ప్రాంతీయ శాంతి, భద్రతలకు ముప్పుగా పరిణమించే ఉగ్రవాద గ్రూపులను ఎదుర్కోవడానికి ఆఫ్ఘనిస్తాన్ సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన నిర్మాణాత్మక మార్పులపై ప్రతి ఒక్కరు చర్చించి నిర్ణయం తీసుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. బాలికలకు విద్య, మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం వల్ల ఉత్పాదకత, వృద్ధిని పెంపొందిస్తుందని, ఇది యువతలో రాడికల్ భావజాలాలను తప్పించి సమాజం పై సానుకూల దృక్పధం ఏర్పడేలా చేస్తుందని అజిత్ దోవల్ అన్నారు.